రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్గా పేరుపొందిన నీతా అంబానీ గురించి ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూ ఉంటుంది.. ముఖ్యంగా ఈమె ఫ్యాషన్ లుక్కుకి పెట్టింది పేరు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది. సందర్భాన్ని బట్టి కూడా తన దుస్తులను సైతం ఎంపిక చేసుకుని మారుస్తూ హైలెట్గా నిలుస్తూ ఉంటుంది నీతా అంబానీ. ముఖ్యంగా ఐపీఎల్, బిజినెస్ ఈవెంట్లలో కూడా చాలా మోడరన్ గా కనిపిస్తూ ఉంటుంది. తనకు ఇష్టమైన దుస్తులను ధరించడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది నీతా అంబానీ.


 తాజాగా అమెరికా అధ్యక్షుడు అయిన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి చాలామంది అక్కడ ప్రత్యేకంగా నిలిచారు. కానీ అందులో నీతా అంబానీ మరింత హైలెట్గా నిలిచింది. ఇమే జామేవర్ చీరలో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈమె ధరించిన చీర విషయాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖేష్ అంబానీ భార్యగా ఎంత పేరు సంపాదించిందో చెప్పాల్సిన పనిలేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె ఖరీదైన చీరలతో పాటు ఆభరణాలు, లగ్జరీ యాక్సిస్ వంటివి ఉపయోగిస్తూ ఉంటుంది.

 తాజాగా నీతా అంబానీ ధరించిన ఈ చీర 1900 వందల గంటల పాటు వేయడానికి సమయం పట్టిందట. ఈ విషయాన్ని ఇన్స్టాల్ షేర్ చేసింది. 60 ఏళ్లు అయినా నీతా అంబానీ ఈ చీరలో చాలా చూడచక్కగా కనిపించడమే కాకుండా మరింత అందంగా కనిపిస్తోంది. ఈ చీర ధరించిన బ్లౌజ్ మధ్యలో వజ్రం పొదిగిన బ్రుచ్ మరింత ఆకర్షణీయంగా నిలుస్తోందట. ఈ చీర స్వదేశీ కాంచీపురం చీరలో అందంగా కనిపిస్తోంది నీతా అంబానీ. అయితే ఈమె ధరించిన లాకెట్లు 200ఏళ్ల పురాతనమైన అరుదైన ఒక లాకెట్ ని ధరించిందట. ఈమె బ్లౌజులు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారట. అంతేకాకుండా 18వ శతాబ్దపు భారతీయ ఆభరణాలతో ఈమె ముస్తాబైనట్లు తెలుస్తోంది. చిలుక ఆకారంలో ఉన్నటువంటి లాకెట్లలో మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు వంటివి అమర్చారట. ఈ చీర ధర సుమారుగా కొన్ని లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: