చాలా మంది చికెన్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది కబాబ్ అని, ఫ్రై అని, పులుసు అని ఇలా ఎన్నో రకాలుగా చికెన్ చేసుకొని తింటూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు తాజాగా ఎవరు ఊహించని విధంగా ఒక బిక్ షాకింగ్ విషయం వైరల్ గా మారుతున్నది. ఎందుకంటే కోళ్లల్లో అంతు చిక్కని వైరస్ ఉన్నట్టుగా పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వైరస్ ఎక్కువగా  ఆంధ్రప్రదేశ్లో ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో ఉండేటువంటి కోళ్లపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నదట.


ముఖ్యంగా కోళ్లు గంట క్రితం ఆరోగ్యంగా కనిపించిన ఆ తర్వాత మరణిస్తున్నాయట. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా కొన్ని లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పందెల కోసం పెంచినటువంటి కోళ్ళకే ఈ వైరస్ ఎక్కువగా సోకుతోందని అక్కడి స్థానికులు కూడా వెల్లడిస్తున్నారు. దీంతో చికెన్ తినేవారికి ఇదొక హెచ్చరిక అంటూ మరికొంతమంది తెలియజేస్తున్నారు. ఈ చికెన్ తినడం వల్ల కూడా మనుషులు చనిపోయే ప్రమాదం ఉందంటూ వైద్యులు అయితే హెచ్చరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ అంతు చిక్కని వైరస్ ఇప్పటిది కాదని సుమారుగా నాలుగేళ్ల క్రితమే వచ్చిందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అప్పట్లో కూడా ఇలా కోళ్లు భారీ సంఖ్యలో మరణించాయని దీనివల్ల పౌల్ట్రీ యజమానులు కూడా చాలా ఇబ్బంది పడడం జరిగిందని తెలియజేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఈ వైరస్ తగ్గినప్పటికీ చాలా నష్టాలను పౌల్ట్రీ యజమానులు చవిచూశారు. ఇప్పుడు మరొకసారి ఇలాంటి వైరస్ రావడంతో ఒక్కసారిగా అటు ప్రజలతో పాటు పౌల్ట్రీ యజమానులు కూడా భయపడుతున్నారు.. మరి ఈ వైరస్ ని అరికట్టేందుకు ప్రభుత్వాల సైతం ఏవైనా చర్యలు తీసుకుంటాయేమో చూడాలి మరి.. అందుకే వైద్యులు సైతం కొద్ది రోజులపాటు చికెన్ ని తినడం తగ్గించాలని హెచ్చరిస్తున్నారు.. అయితే ఇది ప్రజలకు హెచ్చరిక అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: