ఆమె మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ లోని మహేశ్వర నగరం నుండి వచ్చానని తెలిపింది. గత 15 రోజులుగా ఇక్కడే ఉంటున్నాను అని తెలిపిన ఈమె, తనకు తెలియకుండా ఎవరో రహస్యంగా తన వీడియో తీశారని, అది సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిందని తెలిపింది. ప్రస్తుతం కుంభమేళాలో దండలు విక్రయిస్తున్నాను. నా అందాన్ని చూసి ప్రజలే తన వద్దకు వచ్చి వీడియోలు తీసుకొని వెళ్ళిపోతున్నారని, కానీ పూసలు మాత్రం ఎవరూ కొనడం లేదని ఆవేదన తెలిపింది. ఇక మహా కుంభమేళాలో 11 వేల రూపాయల వరకు దండలు విక్రయించానని తెలిపింది.
ఇక అలాగే బాయ్ ఫ్రెండ్ గురించి కూడా ఈమె తెలిపింది. తనకు ఎవరూ బాయ్ ఫ్రెండ్ లేరని, ప్రస్తుతం తనకు ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని చెప్పిన ఈమె ,ఆ ఇద్దరూ కూడా తనతో పాటు దండలు అమ్మే సోదరీమణులు అని తెలిపింది.
ఇకపోతే ప్రస్తుతం ఈమె వయసు 16 ఏళ్లు మాత్రమే నట . మహా కుంభమేళాలో దండలు అమ్ముతున్న ఈ అమ్మాయి చిరునవ్వుతోనే చూపరులను ఆకట్టుకుంది. ఇక మొత్తానికి అయితే తన అందంతోనే అందరిని ఆకట్టుకున్న ఈమెకు బాలీవుడ్ మూవీ తో పాటు రామ్ చరణ్ మూవీలో కూడా అవకాశం వచ్చినట్లు సమాచారం.