తాజాగా ఒక వీడియోని నెటిజెన్స్ షేర్ చేయగా ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యానికి గురయ్యాలా కనిపిస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థలో సిబ్బంది నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యం పైన కూడా దెబ్బతీసేలా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే రైల్లో చాయ్ అమ్మే ఒక వ్యక్తి టాయిలెట్ లోపల ఉండేటువంటి జెట్ స్ప్రే తో టీ ప్లాస్ కంటైనర్ను కడుగుతూ ఉన్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. అయితే రైలులో టాయిలెట్లో నిలబడి వేలాది మంది ఉపయోగించే ఈ టాయిలెట్ స్ప్రేతో టీ కంటైనర్ ని వాష్ చేయడం కొన్ని సెకన్ల వీడియోని సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది నెటిజెన్స్ ఇకమీదట రైల్లో టీ, కాఫీ వంటివి తాగితే ఒట్టు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పైన అటు రైల్వే సిబ్బందితోపాటుగా, అలాంటి పని చేసే వారందరి పైన నేటిజెన్లు తీవ్రంగా ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.. మొత్తానికి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న ఈ వీడియో చూసి చాలామంది ఆ వ్యక్తి పైన కేసు వేయాలి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంతమంది ఇవే నీటిని ఆ ప్లాస్క్కులో కలుపుతున్నారేమో అని అనుమానాన్ని కూడా తెర లేపుతో పలు రకాల ప్రశ్నలు అడుగుతున్నారు.