అప్పటినుంచి ఈమె గురించి సోషల్ మీడియాలో AI ఫోటోలతో పాటు పలు ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈమె సహజమైన సౌందర్యంతో అమాయకపు చిరునవ్వుతో అందరిని ఆకట్టుకుంది. అలాగే ఈమెతో చాలామంది యూట్యూబర్స్ కూడా పలు రకాల ఇంటర్వ్యూలకు కూడా నిర్వహించారు. కుంభమేళాలో మోనాలిసా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో ఈమె తండ్రి ఈమెను తమ స్వస్థలానికి పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈమెది మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన వారట.
ఇటీవలే ఆమె తన స్వస్థలానికి వెళ్ళినప్పుడు తన ఇల్లుకు సంబంధించి ఒక వీడియోను కూడా ట్విట్టర్లో షేర్ చేసింది. ఇందులో తన సోషల్ మీడియాని కూడా ఎవరు హ్యాక్ చేశారని కూడా వెల్లడించింది. తనకు సపోర్ట్ చేస్తూ తనపైన ప్రేమ చూపించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసింది మోనాలిసా.. అలాగే తన గ్రామం తన ఇల్లు గురించి చెబుతూ.. తన నివసిస్తున్న అటువంటి ఇల్లును చూపించింది.. తన సొంత ఇల్లు ఇదే అని ఈ గ్రామంలో కేవలం 100 మంది జనాలు మాత్రమే ఉంటారని కుంభమేళాలలో పూసల దండలు రుద్రాక్షలు అమ్మడానికి వెళ్లినట్లు తెలియజేసింది. తాన సోషల్ మీడియాలో పాపులర్ కావడం చేత అక్కడ దండలు అమ్మడం కుదరలేదు అంటూ వెల్లడించింది. తనని కాపాడుకోవడం కోసం కుటుంబ సభ్యులకు కూడా చాలా కష్టంగా మారిందని తెలియజేసింది మోనాలిసా.. తన ఐడి హ్యాక్ చేయడం వల్ల చాలా నష్టపోతున్నానని తిరిగి ఇవ్వాలని కొంతైనా సంపాదించుకోవాలని వెల్లడించింది మౌలాలిసా.