ఇదిలా ఉండగా లక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలోనే అదే గ్రామానికి చెందిన మొకర ఆదిత్య 22 కూడా గ్రామ శివారున బలవనర్మణానికి పాల్పడ్డారు. ఆడ కొండల్లోని గోడౌన్‌లో ఆదిత్య ఉరేసుకోవడం గమనించిన మేకల కాపర్లు కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. ఒకే రోజు ఒకే సమయంలో వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడటం మిస్టరీగా మారింది.ఇదిలావుండగా ఈ ఘటనలపై పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఫోన్ రికార్డింగ్‌లు, చాటింగ్‌లు కీలకంగా మారాయి. కలిసి జీవించడం సాధ్యం కాదని.. క్షణికావేశంలో ఆదిత్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా వెను వెంటనే.. లక్ష్మి సైతం తన ఇంటిలో ఉరేసుకొని మృతి చెందింది. ఆదిత్య ఉరేసుకునే సమయంలో లక్ష్మికి వీడియోకాల్ చేయడంతో భయపడి తను కూడా ఉరేసుకొని మృతి చెందిందని పోలీసులు తెలిపారు. అయితే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లు పేర్కొంటున్నారు.మంగళవారం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం లక్ష్మి, ఆదిత్య మృతదేహాల్ని విడివిడిగా గ్రామానికి తీసుకొచ్చి గ్రామ శివారు గోస్తనీ నదీ తీరంలోని శ్మశాన వాటికలో విడివిడిగా దహనం చేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు సోమవారం, మంగళవారం పికెట్ నిర్వహించారు.