ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎలాంటి సంఘటనలు జరిగా క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి.. స్కూల్ విద్యార్థులు , ఉపాధ్యాయులు వివాహం చేసుకున్న సంఘటనలు అప్పుడప్పుడు మనం వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు తాజాగా క్లాస్ రూమ్ లోనే ఒక స్టూడెంట్ ని లేడీ ప్రొఫెసర్ వివాహం చేసుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మరి ఈ వివాహం నిజంగానే జరిగిందా అది ఎక్కడ జరిగింది ఏంటన్నది పూర్తిగా చూద్దాం.


స్టూడెంట్ లేడీ ప్రొఫెసర్ కు దగ్గరుండి మరి విద్యార్థులు పెళ్లి చేసినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ లో హరిన్ఘటనలో  ఉన్న మౌలానా అబుల్ కలాం(MAKAUT )యూనివర్సిటీలో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపైన యాజమాన్యం కూడా విచారణ చేపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీలో ముగ్గురు సభ్యుల విచారణలకు ఏర్పాటు చేసినట్లుగా అక్కడ బృందం తెలియజేసింది. ముఖ్యంగా ప్రొఫెసర్ నుంచి వివరణ కోరడం జరిగిందట. అయితే క్లాసు సైకో డ్రామా ప్రొఫెసర్ గా ఆమెను అధికారులు గుర్తించారు.


అయితే ఇది అకాడమీ ప్రాజెక్టులో ఒక భాగం అని అసలు పెళ్లి కాదు అంటే తెలియజేశారు. సైకాలజీ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దిగజార్చడానికి కొంతమంది ఇలాంటి వీడియోలు సైతం లీక్ చేస్తున్నారంటూ అక్కడ ప్రొఫెసర్లు ఫైర్ అవుతున్నారు.  విచారణ ముగిసే వరకు సెలవులపై వెళ్లాలంటూ అక్కడ ప్రొఫెసర్స్ నీ వారు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా అధ్యాపకులతో కూడినటువంటి కమిటీ విచారణ జరుగుతున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే విచారణ ముగిసే వరకు తరగతిలో విద్యార్థులు ఎవరూ కూడా రాకూడదని కోరినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇదంతా కూడా సైకాలజీ డిపార్ట్మెంట్ కి చెందిన కొన్ని ఇన్సిడెంట్ ను తెలియజేసేందుకు ఇలాంటి వీడియోలు చేశారంటూ ట్విట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: