ఇక గత శతాబ్ద కాలంలో 2024 లో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకు ఎక్కింది .. ఇక ఇప్పుడు ఈ 2025 కూడా అదే రీతిలో ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక వాతావరణంలో వచ్చిన మార్పులు ప్రభావం .. లానినా పరిస్థితులపై పడుతుంది .. లానినా బలహీన పడటంతో శీతాకాలంలోనూ చలి తీవ్రత అసాధారణంగా లేదు వచ్చే వారం నుంచి తూర్పు మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి .. ఇక ఉత్తరం మధ్య తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంటున్నారు .
ఇక దక్షిణ వాయువ్య భారతంలోని కొన్ని ఏరియాలో మినహా అన్ని ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం ఉంటుందని అంటున్నారు .. అలాగే కేరళలో జనవరిలోనే ఉష్ణోగ్రతలో సాధారణంగా కంటే అధికంగా పెరిగిపోయాయి .. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కాబోతున్నాయని వాతావరణం శాఖ అంచనా వేస్తుంది .. వచ్చే రెండు రోజుల్లో ఒఉక్కపోత మొదలవుతుందని తెలుగు రాష్ట్రాల్లో కోస్తా ఆంధ్ర తో పోలిస్తే రాయలసీమ , తెలంగాణలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు .