ఈ వీడియో ఒక నిమిషం వీడియో గా చిత్రీకరించారు ఇందులో భూమి ఎలా భ్రమిస్తుందో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చూపించారు. అలాగే నక్షత్రాలు నిశ్చలంగా ఉన్నప్పుడు భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని ఇందులో చూపించారు. ఈ వీడియో బంధించడానికి సైతం తాను చాలా ఇబ్బందులు పడినట్లుగా తెలియజేశారు అంగ్ చుక్. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా యూజర్స్ నేటీజేన్స్ సైతం ఎంతో అద్భుతంగా ఉన్నది భూమి ఇలా తిరుగుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు భూ భ్రమణం గురించి సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా ఈ వీడియో ఉందని తెలియజేస్తున్నారు.
లద్దాక్ లొని విపరీతమైన శీతల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ వీడియోని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సుమారుగా నాలుగు రాత్రులలో పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు టైమర్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఎంత ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారని తెలియజేశారు ఆంగ్ చుక్.. కానీ ఎలాగైనా ఈ వీడియోని రూపొందించాలని ఆలోచనలో వాటన్నిటిని ముందుకు తీసుకొని వెళ్ళానని తెలియజేశారు. మొత్తానికి ఒక అద్భుతమైన వీడియోని షేర్ చేశారని చెప్పవచ్చు. చూడడానికి ఇది ఒక సరికొత్త లోకంలో కనిపిస్తూ ఉన్నది. ఆకాశం నీలిరంగు నుంచి మసక బారిన విషయాన్ని కూడా చాలా క్లియర్ గా ఇందులో కనిపించడం చూడవచ్చు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన విషయాలను కూడా తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు