సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఏవో ఒక వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. మరికొన్ని సందర్భాలలో మహిళలు కూడా ప్రియుడు మోజులో పడి భర్తలను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పశ్చిమబెంగాలలోని హౌరాలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ తన భర్త కిడ్నీని అమ్మేసి అలా వచ్చిన డబ్బుతో 10 లక్షల రూపాయలతో కూతురు చదువుకి ఉపయోగపడుతుందని భర్తను నమ్మించి మోసం చేసిందట..


అయితే ఆ మహిళ తన భర్తను సైతం నిలువునా ముంచేసి రాత్రికి రాత్రి తన ప్రియుడితో కలిసి ఇల్లు విడిచి పారిపోయిందట. దీంతో నిస్సహాయుడైన భర్త ఆ మహిళపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. బాధితుడు కుటుంబంలో భార్య 10 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నట్లు తెలియజేశారు. అతని ఆదాయం అతను కూతురు చదువులకు సరిపోవడంలేదని అందుకే తన భార్య తన భర్త కిడ్నీని  అమ్మేయండి అంటూ తన మీద ప్రెషర్ పెట్టిందని తెలిపారు.



అయితే భార్య  అతని కిడ్నీని అమ్మిన తర్వాత ఆ డబ్బుతో కూతురు భవిష్యత్తు బాగుపడుతుంది అనుకున్నప్పటికీ కానీ తన భార్య దురుదేషాన్ని పసిగట్ట లేకపోయానని చివరికి తన ప్రియుడుతో పారిపోయిందని తెలిపారు. తన కిడ్నీని  ఎవరైనా కొంటారేమో అని గత నెల రోజులుగా వెతికామని అలా ఒక నెల రోజుల తర్వాత 10 లక్షల రూపాయలకు తన కిడ్నీ అమ్ముడు పోయిందని. అలా ఇద్దరు కలిసి ఆ కొన్న వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చారట. ఆ డబ్బుని తన భార్య డబ్బు  ఇవ్వమని చెప్పగా ఉదయం రాగానే తాను మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తానని చెప్పిందని కానీ భార్య కదా అని అంగీకరించాను.. అదే కాలనీలో ఉంటున్న రవిదాస్ అనే వ్యక్తితో ప్రస్తుతం నివసిస్తుందని తెలియగానే కుటుంబంతో అక్కడికి చేరుకున్నారట. లోపలే ఉండి గడి పెట్టుకొని ఏం చేసుకుంటావో చేసుకో నీకు విడాకులు ఇస్తానంటూ అరిచి గోల చేస్తుందని తెలిపారు నిందితుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: