అసలు విషయంలోకి వెళ్తే..లిదౌరా తాల్ కి చెందిన 85 సంవత్సరాల ధ్యాన్ సింగ్ ఘోష్ ఫిబ్రవరి 3వ తేదీన సోమవారం రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన మరణాంతరం ఆయన చిన్న కుమారుడు దామోదర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే సమాచారం అందుకున్న గ్రామస్తులు, బంధువులు అతని ఇంటికి చేరుకొని అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. దామోదర్ అన్నయ్య కిషన్ సింగ్ కూడా అక్కడికి చేరుకొని అతడు కూడా తన తండ్రి అంత్యక్రియలు చేయాలని అనుకున్నాడు. అయితే కిషన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించడానికి దామోదర్ అడ్డుకున్నాడు. తండ్రి చివరి వరకు తనతోనే వున్నాడని, అందుకే తానే అంత్యక్రియలు చేస్తానని దామోదర్ భీష్మించుకు కూర్చున్నాడు.
అలా ఈ విషయంపై ఇద్దరి సోదరుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ ముగిసే వరకు తండ్రి మృతదేహం కూడా దిక్కులేని అనాధగా ఇంటిముందే ఉంచారు అన్నదమ్ములు. ఇద్దరు కలిసి తండ్రి అంతక్రియలు నిర్వహించడానికి అటు బంధువులు గ్రామస్తులు ఎంతగానో ప్రయత్నించినా ఇద్దరు వినలేదు .దీంతో మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేయాలని అనుకున్నారు.దీంతో భయపడిపోయిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకొని పెద్దకొడుకు కిషన్ సింగ్ ఘోష్ కే కర్మకాండ బాధ్యతలను అప్పగించారు ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఇది చూసిన నెటిజెన్స్ మీరెక్కడి కొడుకుల్లారా అంటూ తిట్టిపోస్తున్నారు.