ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కోలీవుడ్ డాన్సు మాస్టర్ ప్రభుదేవా తరువాత మనకి ప్రముఖంగా వినబడే పేరు జానీ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన జానీకి ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు కూడా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనుకోని కారణాల వలన ఆ అవార్డు ఇవ్వలేదు కానీ, జానీ టాలెంటుని మాత్రం ఇక్కడ ఎవ్వరూ తక్కువ చేయలేరు. ఆయన చేసిన సినిమాలే ఆయన సత్తా ఏమిటో చూపిస్తాయి మరి!

విషయంలోకి వెళితే... తన అసిస్టెంట్ పెట్టిన లైంగిక వేధింపుల కారణంగా జానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కాగా ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉండడం గమనార్హం. ఈ కేసులో జానీ మాస్టర్ బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. అయితే జానీ తిరిగి వచ్చిన తర్వాత వర్క్ లైఫ్ ఎలా ఉంటుందాని అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా, అందరికీ షాక్ ఇస్తూ జానీ మరలా బ్యాక్ అయ్యాడు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ ఆయనపై కేసు పెట్టడంతో జానీకి ఆఫర్లు వస్తాయా? అని అందరూ అనుకున్నారు. కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ మళ్లీ బిజీ అవుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా జానీ మాస్టర్కన్నడ సినిమా సెట్స్‌కి వెళ్లారు. అక్కడ ఊహించని విధంగా జానీకి స్వాగతం లభించింది. జానీ మాస్టర్‌కి దిష్టి తీసి హారతిచ్చి సెట్స్‌లోకి ఆహ్వానించడంతో జానీ చాలా ఎమోషనల్ అయ్యారు. అనంతరం కేక్ కట్ చేయించి మరీ వెల్కమ్ చెప్పారు. ఇంతటి ఘన స్వాగతం చూసి జానీ మాస్టర్ కన్నీరు మున్నీరు అయ్యారు. అందరికీ నమస్కారం చేసి థాంక్యూ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోని జానీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జానీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా "చాన్నాళ్ల తర్వాత బెంగళూరులో అడుగుపెట్టాను. యూవర్స్ సిన్సియర్లీ రామ్ సెట్స్‌లో అడుగుపెట్టిన నాకు ఇంతటి ఘన స్వాగతం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీమ్ ప్రతి ఒక్కరికీ పేరుపేరునా రుణపడి ఉంటాను.!" అంటూ జానీ మాస్టర్ పోస్ట్ లో రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: