సాధారణంగా అమ్మాయిల కోసం అబ్బాయిలు కొట్టుకున్న సందర్భాలను మనం చూసే ఉంటాము. కానీ ఒక అబ్బాయి కోసం తాజాగా ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డు మీద కొట్టుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ గా మారడంతో అసలు విషయం బయటపడింది.. పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్లో పూర్ణిమ జిల్లాకు చెందిన ఇద్దరు స్కూలు విద్యార్థులు కొట్టుకున్నట్లుగా తెలుస్తోంది.


ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా ఓకే విద్యార్థిని ప్రేమించారని ఈ విషయం తెలిసిన తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు ఇలా గొడవ పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మాటలతో మొదలైన ఈ గొడవ చివరికి ముదిరి ఇద్దరు కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయింది.. ఇలా ఒకరి పైన ఒకరు దాడి చేసుకుంటూ ఏకంగా జుట్టు పట్టుకొని మరి కొట్టుకుంటున్న సంఘటనలు ఈ వీడియోలో మనం గమనించవచ్చు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ విషయం అక్కడి స్థానికులకు తెలిసిన వెంటనే ఆ ఇద్దరు అమ్మాయిలు మధ్య జోక్యం చేసుకొని గొడవని కాస్త సర్దు మునిగేలా చేసినట్లు తెలుస్తోంది.


కేవలం ఒక అబ్బాయి కోసమే ఇద్దరు అమ్మాయిలు అది కూడా స్కూలు విద్యార్థులు అయ్యుండి కూడా ఇలా కొట్టుకోవడం ఏంటా అంటూ పలువురి నేటిజన్స్ సైతం కామెంట్ చేస్తూ ఉండగా ఇంత జరుగుతున్నా కూడా అక్కడి ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూర్ణిమాలోని గులాబ్బాగ్ హంసద్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వీరందరూ చదువుతూ ఉన్నారట. మరి ఈ విషయం పైన అటు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. రాజస్థాన్ బీహార్ అంటే ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా ఎక్కువగా స్కూళ్లల్లో జరిగే వ్యవహారాలే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రిన్సిపల్ తో ఉపాధ్యాయులు స్కూళ్లలోని అసభ్యకరమైన పనులు కూడా చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: