![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/viral/127/allu-arjun76681c9c-9193-4b19-a620-76ea240a9274-415x250.jpg)
అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోకంటే కూడా నార్త్ సర్కిల్స్ లో ఎక్కువగా సూపర్ హిట్ అయింది. కేవలం ఒక్క హిందీలోనే ఈ సినిమా 800 కోట్లకి పైగా వసూళ్లు చేసి బాలీవుడ్ ని షేక్ చేసింది. అంతేకాకుండా... ఈ సినిమా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా ఆడుతున్నట్టు కనబడుతోంది. దీంతో ‘పుష్ప 2’ సినిమా నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 ట్రెండింగ్‌లో నిలవడమంటే మాటలు కాదు. వివిధ దేశాల ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను చూస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు మరి.
అసలు విషయంలోకి వెళితే... కుంభమేళాలో పుష్ప-2 తళుక్కున మెరిశాడు. అవును, మీరు విన్నది నిజమే.. కానీ నిజం కాదు! ఏంటి ఆశ్చర్యపోతున్నారా? విషయంలోకి వెళ్తే.. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలి వెళ్లగా తాజాగా మహా కుంభమేళాలో అల్లు అర్జున్ పుష్ప-2 గెటప్‌తో ఓ అభిమాని సందడి చేశాడు. తగ్గేదేలే అంటూ పుష్పరాజ్‌ను అచ్చు దించేశాడు. దాంతో ఆ వ్యక్తితో సెల్ఫీలు దిగేందుకు అంతా పోటీ పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాగ్ రాజ్ కు కారులో వెళ్లిన ఖలీని చూసేందుకు అక్కడి జనాలు ఎగబడ్డారు. ఖలీతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇక పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ నటనకు విదేశీయులు కూడా ఫిదా అవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్... అర్జున్ గాల్లోకి ఎగిరే ఫైట్ సన్నివేశాలు చూసి "అమెరికా చిత్రాల కంటే బాగా ఉందని, మార్వెల్‌లో కూడా ఈ క్రియేటివీటీ సాధ్యం కాలేదంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు."