ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మొబైల్స్, ల్యాప్ టాప్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో చాలామందికి సైట్ అనేది వస్తూ ఉన్నది. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత రీడింగ్ గ్లాసెస్ కచ్చితంగా ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే మనం తినే ఆహార లోపాల వల్ల కూడా కొంతమందికి చిన్న వయసు నుంచె భూతద్దాలు వంటివి ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా డ్రెస్ రెగ్యులర్టరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక రీసెర్చ్ చేస్తోందట. దీంతో రీడింగ్ గ్లాసెస్ ని పూర్తిగా తొలగించడానికి కంటి చుక్కలను సైతం ఆమోదించుతోంది.


అయితే ఇది 40 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా ఒక గొప్ప వరంలా ఉంటుందని తెలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ల మంది ఈ రకమైన వాటితో ఇబ్బంది పడుతున్నారట. ఈ సమస్యను సైతం పరిష్కరించుకోవడానికి ఇప్పుడు ప్రెస్వు (presvu) అనేటువంటి కంటి చుక్కలను అభివృద్ధి చేస్తున్నారట. ఈ చుక్కలు వేసుకుంటే 40 ఏళ్ల పైబడిన వారిలో అద్దాలు అవసరాన్ని తగ్గించేలా చూస్తుందట. ఈ కంటి చుక్కలు అద్దాలు ఉపయోగించకుండా చూడడమే కాకుండా కళ్ళు పొడిబారకుండా ఉండేలా చూస్తుందట.


సంవత్సరాల తరబడి ఉపయోగించినప్పటికీ కూడా ఎటువంటి హాని కలిగించకుండా వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి వాటికి ఎక్కువగా కాంటాక్ట్ లెన్స్ ను శస్త్ర చికిత్స పద్ధతిని ఉపయోగిస్తూ ఉండేవారు.. అయితే ఇప్పుడు అదంతా కూడా అవసరం లేకుండా కేవలం చుక్కలు ఒక చుక్క వేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. దీనిని ఇండియాలో 2019 నుంచి పరిశోధనలు చేస్తూ ఉన్నారట. ఈ చుక్కలని అప్లై చేసిన 15 నిమిషాలలోనే చురుగ్గా పనిచేయడం మొదలవుతుందట కంటి లోపాలతో బాధపడే వారికి ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీని ధర కూడా  రూ 350 రూపాయలకి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే అన్ని ప్రాంతాలలో కూడా వీటి అమ్మకాలు మొదలవుతాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: