మాల్య తరుపు సీనియర్ న్యాయవాది అయిన సహజ పువయ్య తన వాదనలను సైతం వినిపించారు.. విజయ్ మాల్య బ్యాంకుకు 6200 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ తనతో 14 వేల కోట్ల రూపాయలు రికవరీ చేశారని ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవలే లోక్ సభలో తెలియజేశారని మాల్యా తరఫున న్యాయవాది కూడా కోర్టులో వెల్లడించారు. మాల్యా తో రూ.10,200 కోట్ల రూపాయలు ఎక్కువగా కట్టించారని వాదించారు న్యాయవాది సాజన్. అందుకే రుణానికి సంబంధించినటువంటి మొత్తం స్టేట్మెంట్ ను బ్యాంకు మాల్యాకు అందించాలంటూ కోర్టుని కోరారట.
మాల్య పిటిషన్ ఆధారంగా జస్టిస్ R.దేవదాస్ నేతృత్వంలోనే కర్ణాటక హైకోర్టులో సైతం బ్యాంకు లోన్ రికవరీ సంబంధించి అధికారులకు కూడా నోటీసులను జారీ చేసిందట. గత కొన్నేళ్లుగా లోన్ తీసుకొని ఎగ్గొట్టారని ఆరోపణలతో విజయ్ మాల్యా చాలా ఇబ్బంది పడుతున్నారనే విధంగా తెలియజేశారట. ప్రస్తుతం అయితే ఆయన లండన్ లో ఉంటున్నారని ఈ కేసులో అక్కడి పోలీసులు విజయ్ మాల్యాను భారత్ కు సైతం అప్పగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి విజయ్ మాల్యా తో ఎక్కువగా కట్టించుకున్నారని వార్తలు వినిపిస్తున్న సందర్భంలో చాలామంది ఆశ్చర్యపోతున్నారు.