ఇక వాటి చావుకి ఖచ్చితమైన కారణం ఇంకా బయటికి రాలేదు .. అధికారులు ఇది H 15N వైరస్ అయి ఉండవచ్చని అంటున్నారు . కోళ్లకు ఈ H15N వైరస్ రావడం ఇదే తొలిసారి ఏమీ కాదు. 2012, 2020లో కూడా ఇదే తరహాలో వైరస్ వ్యాపించింది. నాలుగేళ్ల క్రితం ఈ వ్యాధి సోకిన అనేక కోళ్లు మృత్యువాతపడ్డాయి. అప్పుడు కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియని అయోమయం నెలకొంది. ఇక సరైన వైద్యం , టీకాలు లేకపోవడం , సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఇలా మరణాలు సంభవించి ఉండవచ్చు అని నివేదికలు చెబుతున్నాయి ..
గుడ్లు పెట్టిన నిమిషాలోనే కొన్ని కోళ్లు చనిపోతున్నాయని రైతులంటున్నారు .. ఈ వైరస్ ఇతర కోళ్లల్లో కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది .. కోళ్ల పెంపకం దారులకు ఇది పెద్ద నష్టాన్ని తీసుకువస్తుంది . ఇక ఈ విషయం పై ఏలూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ టి . గోవిందరాజు మీడియా తో మాట్లాడుతూ గత మూడు వారాల్లో ఒకే ప్రాంతంలో 35,000 కోళ్లు మరణించాయి .. ఇలా చనిపోయిన కోళ్లను సురక్షితంగా పూడ్చి పట్టడానికి పశు వైద్య అధికారు లను గవర్నమెంట్ వెంటనే పంపించినట్లు తెలిపారు .. ఇక ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రజానికం కూడా కోడి మాంసం కొన్నాలు తినకుండా ఉంటే మంచిదని కూడా సూచిస్తున్నారు .