ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్నటువంటి మహా కుంభ వేళకు చాలా మంది భక్తులే కాకుండా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరూ కూడా కుంభమేళకు వెళుతున్నారు. దాదాపుగా 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళలో పాల్గొనడానికి ఇతర దేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా త్రివేణి సంఘంలో ఈ స్నానం ఆచరించడం భక్తులకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక అక్కడి ప్రభుత్వం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు.


కుంభమేళకు వస్తున్న భక్తుల కోసం చాలా శిబిరాలు గుడారాలను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా పవిత్రమైన ప్రదేశంకు వచ్చిన ఒక జంట చేసిన పాడు పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. కుంభమేళ హిందువుల పవిత్రమైన పండుగగా భావిస్తూ ఉంటారు. ఇప్పటికే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో మద్యం, మాంసం వంటి వాటిని ప్రభుత్వాలు కూడా నిషేధించాయట. అయితే ఒక జంట మాత్రం సీక్రెట్ గా తమ గుడారాలలో మాంసాహారాన్ని వండుకుంటూ ఉండడంతో అక్కడ ఉన్నవారు ఈ విషయాన్ని గమనించారట.


వెంటనే ఆ సమీపంలో ఉన్న నాగ సాధువులకు సైతం చెప్పగా దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఒక నాగ సాధువులు,అలాగే అక్కడికి చేరుకున్న భక్తులు ఆ దంపతులను గుడారాలను కూడా కూల్చివేశారు. దీంతో వారి పైన తీవ్రమైన ఆగ్రహాన్ని తెలియజేస్తూ దాడి చేస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. అలాగే గిన్నెలో ఉన్న మాంసాహారాన్ని కూడా కిందపడేసినట్లు సమాచారం. ఇలా పవిత్రమైన ప్రదేశం కు వచ్చి మరి ఇలాంటి పనులు చేయడం ఏంటో అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గుడారాన్ని సైతం పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా ఈ వీడియోలో అయితే ప్రస్తుతం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: