అంటే ప్రతిరోజు ఇక మీదట 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు బాల రాముడి దర్శనాన్ని అనుమతిస్తారట. అలాగే తెల్లవారుజామున నాలుగు గంటలకే మంగళహారతి ఇచ్చిన తరువాత కాసేపు ద్వారాలను మూసివేసి.. ఆ తర్వాత భక్తుల కోసం ఆలయాన్ని తెరిచేందుకు ఆరు గంటల నుంచి శ్రీంగార హారతి ఇస్తారట. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భోగ్ నైవేద్య సమర్పణ కూడా ఇస్తారట.ఆ సమయంలో కూడా భక్తులు దర్శనాన్ని చేసుకోవచ్చట. అలాగే రాత్రి 7 గంటలకు సంధ్యా హారతి కూడా ఇస్తారట.
ఆ సమయంలో 15 నిమిషాలపాటు గుడి తలుపులు మూసివేస్తారని తిరిగి మళ్లీ భక్తుల దర్శనం కోసం తీస్తారట.ఆ తర్వాత మళ్లీ రాత్రి 9:30 నిమిషాలకు శయన హారతి ఇస్తారట ఆ తర్వాత రాత్రి 10 గంటలకు నిర్వహించి తలుపులు మూసివేస్తారట. అయితే పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగానే కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సైతం వెల్లడించింది.. అలాగే జనవరి 26 నుంచి వసంత సప్తమి ఫిబ్రవరి మూడు వరకు కొనసాగింది.. దీంతో కోటి మందికి పైగా భక్తులు సైతం అయోధ్య బాల రాముని సందర్శించారట.ఇది ఒకసారి కొత్త రికార్డు అంటూ యూపీ ప్రభుత్వం వెల్లడించింది.