చతిస్గడ్ ప్రాంతంలో ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో కొంతమంది జవాన్లు మరణిస్తూ ఉండగా మరి కొంతమంది మావోయిస్టులు కూడా మృతి చెందిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చతిస్గడ్ లోని బీజాపూర్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంద్రావతి నేషనల్ పార్క్ వద్ద భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య హోరాహోరీగా భీకరమైన కాల్పులు జరగడంతో ఏకంగా 31 మంది మావోయిస్టు సైతం మృతి చెందారట. ఈరోజు ఉదయం 9:00 గంటల సమయంలో  ఈ సంఘటన జరిగినట్లుగా పోలీసుల తెలియజేశారు.



అయితే ఇప్పటివరకు 31 మంది మృతి దేహాలను సైతం వెలికి తీసారని ఈ చంపబడిన నక్సలైట్ల సంఖ్య మరికొన్ని గంటలలో పెరిగే అవకాశం కూడా ఉన్నదట. ఈ ఘటన స్థలం నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారట. అయితే అందులో పాల్గొన్న కొంతమంది సైనికులు కూడా గాయపడ్డారనే విధంగా అధికారులు తెలియజేస్తున్నారు. దీనిపైన ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నది. భద్రత దళాలు మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు సైతం కొనసాగుతూ ఉన్నాయని సమాచారం. దీంతో నక్సలైట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నదట.


చతిస్గడ్, ఒరిస్సా సరిహద్దులలో గరియా బంద్ జిల్లా అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది.అక్కడ 20 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా దేశం నుంచి నక్సలిజాన్ని సైతం పూర్తిగా నిర్మూలిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించారు. అందుకే ఇటీవలే కాలంలో చత్తీస్గడ్ లోనే చాలా చోట్ల నక్సలైట్లు హతమవుతూ ఉన్నారట. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు సుమారుగా 48 మంది మావోయిస్టుల సైతం మృతి చెందారని తెలుపుతున్నారు. 2024లో సుమారుగా 290 మందికి పైగా మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది మరికొన్ని గంటలలో పూర్తిగా తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: