మృత్యువు అనేది ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి రూపంలో వస్తుందని విషయం ఎవరు చెప్పలేమని చెప్పవచ్చు.. కొన్ని సందర్భాలలో సడన్గా వస్తూ ఉంటుంది. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తి సడన్గా మృతి ఒడికి చేరడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగినట్లు పలు రకాల వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్లోని ఒక స్టేజ్ మీరే యువతి ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆ వెంటనే ఆమె మరణించిందట. అందుకు  సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతున్నది.


మధ్యప్రదేశ్లో విదిశ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడి పెళ్లి వేడుకల లో భాగంగా యువతి స్టేజ్ మీద చాలా ఆనందంగా డాన్స్ వేస్తూ ఉన్న సమయంలోనే ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. తన సోదరి వివాహం కోసమే ఈ ఇండోర్ నుంచి వచ్చిందట. ఆమె పేరు పరిణిత జైన్ గా కూడా గుర్తించారు. ఫ్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో భాగంగా ఇలా సంగీత కచేరిని ఏర్పాటు చేయగా అందులో పాల్గొన్న పరిణిత పాటకు డాన్స్ వేస్తూ అందుకు తగ్గట్టుగానే హుషారుగా స్టెప్పులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.


ఈ వీడియోని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలోనే ఇంతలో ఎవరు ఊహించని విధంగా ఇలాంటి సంఘటన జరిగింది. అలా ఒక్క సారిగా స్టేజి మీద పడిపోవడంతో బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలియజేశారట. ఈ విషయం విన్న అటు బంధువులు కుటుంబ సభ్యులు సైతం ఒకసారిగా శోకసముద్రంలోకి మునిగిపోయారు. యువతి డాన్స్ వేస్తూ మరణించిన తీరుని సోషల్ మీడియాలో చాలామంది వైరల్ గా చేస్తున్నారు. అయితే ఈ యువతి యొక్క మృతికి కారణం గుండెపోటు అయ్యి ఉండవచ్చు అని అనుమానలు కూడా మొదలవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: