హిందూ రాజ్య స్థాపనకు సహకారం ఇవ్వలేదని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ పై కొంతమంది దుండగులు దాడి చేసిన ఘటన ఇప్పుడు కలకాలం రేపుతుంది .. టార్గెట్ గా వెళ్లి చిలుకూరి ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి చేయడం వెనక భారీ కుట్ర ఉందని సాధారణ భక్తులు , ప్రజలు భావిస్తున్నారు .. ఇక ఈ కేసులో కొత్తూరు వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు .. ఈ వ్యక్తి రామరాజ్యం అనే సంస్థ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా పోస్టులు కూడా ఉన్నాయి.. 350 రిజిస్ట్రేషన్ ఫీజు కడితే 20  వేలు జీతం ఇచ్చి సైన్యంలో చేసుకుంటున్నామని ఇచ్చిన ప్రకటనలు కూడా వైరల్ అవుతున్నాయి ..


ఇక ఈ వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో కొన్ని రెచ్చగొట్టే వీడియోలు కూడా హాట్ టాపిక్ గా చేశాడు .. ఇతని వ్యవహారం వ్యవస్థలపైనే దాడులు చేయటం ఏదో తేరాగా ఉందని ఇతర ఎజెండాతో ఈ దాడులకు దిగుతున్నారని అనుమానాలు కూడా వస్తున్నాయి .. హిందూ ధర్మం పేరుతో ప్రధాన గుడి పూజారి పై దాడి చేశారు . ఇందులో ఎవరి కుట్ర ఏమిటో బయట పడాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయాలు కూడా వస్తున్నాయి . అసలు ఈ వీర రాఘవరెడ్డి గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అని కూడా అంటున్నారు.


అలాగే సమాజంలో అశాంతి రేపటానికి.  ఇలాంటి ఆసాంఘిక శ‌క్తులు ముఠాలు ఎక్కువయే అవకాశాలు ఈ రీసెంట్‌ టైమ్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి  . అందుకే ఈ ఇష్యుపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి .. ఇక దాడి జరిగింది ఒక పూజారిపైన కాబట్టి రాజకీయం కూడా ఇందులో మొదలవడం ఖాయం .. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది .. ఇలాంటి దుష్టశక్తుల వెనక ఎలాంటి మొటాలు ఉన్నాయో వెలుగు తీసి .. హిందూ ధర్మం పేరుతో దాడులు చేస్తున్న వీర రాఘవరెడ్డి లాంటి వారిని కఠినంగా శిక్షించాలి.. ఇలాంటి వారి వెనుక ఉన్న దుష్టశక్తుల్ని కూడా బయటకు తీసి ప్రజల ముందు పెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: