అయితే స్మార్ట్ ఫోన్ వినియోగం కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అతిగా మొబైల్ ని ఉపయోగించడం వల్ల బ్యాటరీ హీటెక్కి బ్లాస్ట్ అయ్యి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది ప్రాణాలే పోగొట్టుకోక మరి కొంతమంది చేతులు, కాళ్లు,గాయాలు ఇలా ఏవో అయినట్టుగా తెలియజేస్తూ ఉంటారు. తాజాగా బ్రెజిల్ లో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.
అసలు విషయంలోకి వెళితే ఒక మహిళ తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్కు వెళ్ళింది. అక్కడ వస్తువులు కొంటూ ఉన్న సమయంలోనే ఆమె బ్యాక్ ప్యాకెట్ లో ఉన్న మొబైల్ ఒక్కసారిగా పేలింది. అయితే ఈ ఊహించని ఘటనతో అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఈ పేలుడులో మహిళ వెనుక భాగంతో పాటుగా చేతులకు కూడా చాలా తీవ్రమైన గాయాలు అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. మొబైల్ పేలిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తన భర్త వెంటనే ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాక్ పాకెట్లో పెట్టుకోవడం మొబైల్ చాలా ప్రమాదమని నిపుణులు కూడా ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినా కూడా చాలామంది మారడం లేదు.