ఈ క్రమంలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. పరిణీతి సోదరుడు కూడా అచ్చం ఇలాగే చనిపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అతడు 12 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత సోదరుడిలాగే పరిణీతి కూడా హార్ట్‌ఎటాక్‌తో మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు దారుణంగా శోకించారు. ఎంబీఏ పూర్తిచేసిన పరిణీతకు త్వరలోనే తల్లిదండ్రులు వివాహం చేయాలని అనుకోగా... అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. అయితే తాజాగా ఈ ఘటనపై ఆమె తండ్రి స్పందిస్తూ... కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.
పరిణీత చాలా విభిన్నమైన వ్యక్తి అని... ఆమె ప్రతి రోజు యోగా, జిమ్ చేస్తున్నా... ఆమెని గుండెపోటు కబలించిందని వాపోయాడు. అదేవిధంగా ఆమె మరణించిన వారం రోజుల ముందే ఫుల్ బాడీ చెక్ అప్ చేయించుకుందని... రిజల్ట్ నార్మల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయినా సరే ఈ సడెన్ హార్ట్ ఎటాక్ ఏమిటి? అన్నట్టు ఆయన ఆశ్చర్యపోయాడు. పరిణీత ఆరోగ్యం పట్ల ఎక్కవ దృష్టి పెట్టేదని, ఫుడ్ విషయంలో కూడా అంతే ఖచ్చితంగా ఉన్నప్పటికీ కాలం ఆమె విషయంలో అన్యాయం చేసిందని వాపోయాయడు. ఇకపోతే ఇటువంటి ఘటనలు చూసిన నెటిజన్లు.. కోవిడ్ 19 వ్యాప్తి తర్వాత తరుచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, కరోనా టీకాల వల్లే ఇలా జరుగుతోందని ఆరోపించగా ఈ నిరాధారమైన ఆరోపణలను వైద్యులు మాత్రం తోసిపుచ్చుతున్నారు.