అనంతపురం జిల్లా, గుత్తిలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. అసలేం జరిగిందంటే.. అమ్మడు ప్రేమించినోడు నంబర్ బ్లాక్ చేశాడని ఏకంగా 100కి ఫోన్ చేసి పోలీస్‌ల సాయం కోరింది. పోలీసులు ఫోన్ ఎత్తగానే ఆ అమ్మాయి టెన్షన్‌గా "అతను నాతో మాట్లాడట్లేదు సార్. నా నంబర్ బ్లాక్ చేసేశాడు. మీరు ఒకసారి అతనికి ఫోన్ చేసి అన్‌బ్లాక్ చేయమని చెప్పరా ప్లీజ్" అని అడిగేసింది. అక్కడి నుంచి కాల్ గుత్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. బ్లూ కోల్ట్స్ టీమ్ వెంటనే రంగంలోకి దిగింది.

పోలీసులు ఆ అమ్మాయికి కాల్ చేసి అసలు విషయం ఏంటని ఆరా తీశారు. తన బాయ్‌ఫ్రెండ్‌కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, జస్ట్ తన నంబర్ అన్‌బ్లాక్ చేస్తే చాలని, అంతేకాదు ఒక్కసారి మాట్లాడితే లేదా ఇంటికి వచ్చి వెళ్తే చాలని చెప్పింది ఆ లవ్లీ లేడీ. అయితే పోలీసులు మాత్రం స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇంకాస్త సీరియస్‌గా తీసుకుంటామని సలహా ఇచ్చారు.

సాధారణంగా పోలీస్‌లకు వచ్చే కాల్స్ ఎలా ఉంటాయి? హరాస్‌మెంట్, మోసం, బెదిరింపులు.. ఇలాంటి సీరియస్ విషయాలపైనే కదా కంప్లైంట్స్ వస్తాయి. లవ్ పేరుతో మోసం చేయడం, డబ్బులు గుంజడం, నమ్మించి వంచించడం.. ఇలాంటి వాటిపై యంగ్ ఉమెన్స్ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు. కానీ ఇలా నంబర్ బ్లాక్ చేశారని 100కి ఫోన్ చేయడం మాత్రం నిజంగా రేర్ కేసు అనే చెప్పాలి. అందుకే అందరూ షాక్ అవుతున్నారు.

అయితే పోలీసులు ఈ అమ్మాయి రిక్వెస్ట్‌ను లైట్ తీసుకోలేదు. ఎందుకంటే ప్రేమలో ఫెయిల్ అయితే కొంతమంది అమ్మాయిలు ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫిబ్రవరి 13న ఈ కాల్ వచ్చింది. అంటే వాలెంటైన్స్ డేకు జస్ట్ ఒక్కరోజు ముందు. అందుకే పోలీసులు వెంటనే స్పందించారు. గుత్తి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సుధాకర్ స్వయంగా ఆ అమ్మాయితో మాట్లాడి బాయ్‌ఫ్రెండ్ నంబర్ తీసుకున్నారు. అతనికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది.

చివరికి ఆ కానిస్టేబుల్ అమ్మాయికి సీరియస్ గ్రీవెన్స్ ఉంటే స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇవ్వమని మళ్లీ సలహా ఇచ్చారు. ఏదేమైనా ఈ కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 100కి ఇలాంటి వింత కారణాలతో కూడా ఫోన్లు వస్తాయా అని కొందరు షాక్ అవుతుంటే, మరికొందరు మాత్రం నవ్వుకుంటున్నారు. ఎమర్జెన్సీ సర్వీస్‌లను ఇలా కూడా యూజ్ చేస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: