![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/viral/127/ap-crime-news-viral-student-acid42be5a23-d109-49f3-85be-56e3b6fa2238-415x250.jpg)
అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండలో ఈరోజు ఉదయం ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా యువకుడు దాడి చేసిన అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందని ఈ విషయం తెలిసే యాసిడ్ దాడి పాల్పడినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లాలోని వీరంపల్లి ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థి చదువుతున్న యువతి పైన మరొక డిగ్రీ విద్యార్థి కత్తితో పొడిచి యాసిడ్ దాడి పాల్పడ్డాడు అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యారట.
అంతేకాకుండా యువతి తల పైన కత్తితో గాయాలు చేయడమే కాకుండా యాసిడ్ పడడంతో ముఖం పైన కాలిన గాయాలు ఉన్నాయట. అలాగే నిందితుడు గణేష్ ని కూడా పోలీసులు గుర్తించారని మదనపల్లిలోని అమ్మవారి చెరువు మెట్టు ప్రాంతంలో ఈ యువకుడు నివసిస్తున్నారని పోలీసులు సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. ఆ యువతిని చికిత్స కోసం మదనపల్లి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 29వ తేదీన ఆ యువతి వివాహం జరగాల్సి ఉండగా ఇలా ప్రేమ పేరుతో యువకుడు కత్తితో దాడి చేయడమే కాకుండా యాసిడ్ పోసి అత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నిరు అవుతున్నారు.. ఇలాంటి సంఘటనల పైన మరి ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఆ యువకుడికి ఏదైనా శిక్ష వేస్తుందేమో చూడాలి.