![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/viral/127/sun51da913d-bcb8-4aad-a38b-31a713f8d954-415x250.jpg)
ఈ ఫిబ్రవరిలోనే ఇలా ఎండలు మండిపోతుంటే .. ఇక మే నెల వచ్చేసరికి పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చు అన్న ఆందోళన కూడా ఉంది . ఇక ఈ సంవత్సరం జనవరిలో పగలు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయాయి .. ఇక ఫిబ్రవరిలో గడిచిన 13 రోజుల్లో అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవ్వగా.. ఈ 13 రోజుల్లో 11 రోజులు దేశం లోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు తెలంగాణలోనే నమోదయ్యాయి .. ఈ క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి అని వాతావరణ శాఖ సూచిస్తుంది.
తెలంగాణలోని మహబూబ్ నగర్, భద్రాచలం, ఖమ్మం, హనుమకొండ, హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
:మహబూబ్ నగర్.. 37.5
:భద్రాచలం..36.8
:ఖమ్మం..36.6
:మెదక్..35.6
:హైదరాబాద్..35.2
:హనుమకొండ.. 35
:ఆదిలాబాద్..34
:రామగుండం. 33.8
:నిజామాబాద్..33.5
:నల్లగొండ.. 33.2 డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..
శనివారం అనగా ఈ రోజు గరిష్టంగా మహబూబ్ నగర్ లో 36.7, .. కనిష్టంగా నల్గొండలో 32 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి . రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు ఎండలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది .. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల సెంటీగ్రేట్ల ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తుంది.