
ఇప్పుడు అలాంటి ఒక విచిత్రమైన సంఘటన వంట చేస్తున్న వీడియో గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ఒక వ్యక్తి డాబాలో చపాతి చేస్తున్న విధానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తి డాబాలో చపాతి చేసేందుకు సైతం పిండినీ కలుపుతూ సిద్ధం చేస్తూ ఉండగా మరొకవైపు కస్టమర్లు భోజనం చేస్తూ ఉండగా వారి ఎదురుగా ఉన్న ఒక గోడ పక్కన అపరిశుభ్రమైన ప్రదేశంలో పిండిని పిసుకుంటూ పెద్ద పాత్రలో పిండి వేసి అపరిశుభ్ర చేతులతోనే వాటిని అటు ఇటు తిప్పుతూ చపాతీలు చేస్తూ ఉన్నారట.
వీటికి తోడు మధ్య మధ్యలో కిందన అపరిశుభ్రంగా ఉన్న ఒక మగ్గు నీటిని తీసుకొని ఆ పిండిలో పోస్తూ ఉన్నారు. పిండి అంతా పిసికిన తర్వాత ఒక పెద్ద చెక్క టేబుల్ పైన వేస్తూ దానిపైన పాత బట్టలను కప్పి చపాతీలు తయారు చేస్తున్న విధానాన్ని చూసి ఒక వ్యక్తి వీడియో తీసుకుంటూ ఆ వ్యక్తిని వెళ్లి అడగగా అతను కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఆ వ్యక్తి అపరిశుభ్రంగా చపాతి చేయడానికి చూసి చాలామంది నెటిజెన్స్, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అందుకే చాలామంది కూడా ఈ మధ్యకాలంలో హోటల్ భోజనాన్ని తగ్గిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు డాబాలలో చపాతీలు తినాలి అంటే భయం వేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.