ఇప్పటికీ ఎన్నోసార్లు మనం భూమి అంతమవుతుందని ఆకాశం నుంచి ఏవేవో పడతాయని యుగాంతం వస్తుందని ఇలా ఎన్నో రకాలుగా గత కొన్నేళ్లుగా మనం వింటూనే ఉన్నాము.. అయితే ఇప్పుడు తాజాగా అంతరిక్షంలో ఒక గతి తప్పిన గ్రహశకళం సైతం భూమండలాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. విశ్వంలో గ్రహ శకలాలు, ఉల్కపాతాలు వంటివి సర్వసాధారణంగానే ఉంటాయి. అయితే అవి దారి తప్పి తిరుగుతూ కూడా ఉంటాయి. ఇలా ఎన్నో ఆస్ట్రాయిడ్స్ కూడా భూమికి చేరిన శకలాలు కూడా మనం చూసే ఉన్నాము.


అయితే వీటన్నిటికీ భిన్నంగా ఒక గ్రహ శకలం మాత్రం అందరిని ఆందోళనకు గురి చేసేలా కనిపిస్తోందట. ఇది భూమిని ఢీకొట్టేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధకులు నాసా వెల్లడించారు. ఇదివరకు వేసిన అంచనాలని సైతం పెంచేస్తుందట. ఈ ఆస్ట్రాయిడ్ అల్లాటప్ప ఆస్ట్రాయిడ్ కాదంటూ నాసా వారు తెలియజేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే 2032లో భూమ్మీద ఢీ కొట్టడానికి..3.1 శాతం వరకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నాసా తెలిపింది. ఈ గ్రహ శకలం కదలిక ఆధారంగా కూడా ఈ సంఖ్య మరింత పెరిగేలా ఉంటుందట.


దీని పేరు ఆస్ట్రాయిడ్ 2024 YR -4  అన్నట్టుగా ఉన్నదట దీని విస్తీర్ణం 117 అడుగులు దాదాపుగా 54 M ఉంటుందట. అంటే సుమారుగా ఒక అపార్ట్మెంట్ ఎత్తుని మనం పరిగణంలోకి తీసుకోవచ్చు. అంతటి భారీ శకలం అవ్వడం చేతే దీనిని సిటీ కిల్లర్ అని కూడా నాసా వారు పేరు పెట్టారు. అయితే ఇది ఏ నగరం మీద పడ్డా కూడా అక్కడ నామరూపాలు లేకుండా పోతాయని నాసా వారు తెలుపుతున్నారు. 2032 డిసెంబర్ 22వ తేదీన YR 4 ఆ స్టయిడ్ భూమిని ఢీకొట్టబోతోందంటూ వెళ్లాడు. సాధారణంగా నాసా వారు అంచనా వేసినవి ఇప్పటివరకు తప్ప లేదట. సుమారుగా 100% వరకు కచ్చితత్వంగా ఉంటుందని తెలుపుతున్నారు. ఈ గ్రహ శకల ఎక్కువగా ఢీకొట్టే ప్రాంతాలలో.. ముంబై, కోల్కత్తా ఉన్నదట. అలాగే బోగాట, లాగోస్, ఢాకా, అబిద్ధాస్ కూడా ఈ జాబితాలో ఉన్నట్లు నాసా తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: