
అయితే, ఇంతలో నాసా బాంబు పేల్చింది. భూమికి పెను ప్రమాదం పొంచి ఉందని తేల్చి చెప్పింది. ఒకప్పుడు భయపెట్టిన గ్రహశకలం మళ్లీ వస్తోంది. వచ్చేది ఏదో చిన్న రాకెట్ కాదు.. ఏకంగా భూమిని ఢీకొట్టే భారీ ఆస్టరాయిడ్. 2032లో ఇది భూమిని గుద్దేసేందుకు దూసుకొస్తోందట.
ఈ విషయం వినగానే శాస్త్రవేత్తలతో సహా చాలా మందికి గుండె గుభేలుమంది. పాత రోజులు గుర్తుకొచ్చాయి. ఒకప్పుడు ఇదే తరహాలో ఓ గ్రహశకలం వస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. దేశం ముక్కలైపోతుంది, ప్రపంచం అంతం అవుతుంది అంటూ పెద్ద రచ్చ జరిగింది. జనాలు భయంతో వణికిపోయారు. ఆస్తులు రాసిచ్చేశారు, దానధర్మాలు చేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుందా?
నాసా శాస్త్రవేత్తలు మాత్రం తేల్చి చెబుతున్నారు. ఈసారి ముప్పు మరింత తీవ్రంగా ఉండబోతోంది. 3.1 శాతం ఛాన్స్ అంటే తక్కువ విషయం కాదు. దాదాపు వదింట మూడవ వంతు ప్రమాదం పొంచి ఉంది. భూమికి నిజంగానే డేంజర్ బెల్స్ మోగుతున్నాయా 2032లో విధ్వంసం తప్పదా ప్రపంచం మళ్ళీ భయంతో బిక్కుబిక్కుమంటుందా వేచి చూడాల్సిందే.
ఈ ఆస్టరాయిడ్ ఎంత పెద్దది, అది భూమిని ఢీకొడితే ఎలాంటి వినాశనం జరుగుతుంది, నగరాలు నేలమట్టం అవుతాయా, సునామీలు విరుచుకుపడతాయా? వాతావరణం పూర్తిగా మారిపోతుందా? ఇలాంటి భయానక ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి, ప్రజలకు సమాచారం ఎందుకు దాచిపెడుతున్నాయి, ఇలాంటి ప్రశ్నలు సామాన్యుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇది కేవలం నాసా సృష్టిస్తున్న హడావిడి అంటున్నారు. 3.1 శాతం అనేది పెద్ద ప్రమాదం కాదని, భయపడాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తెలియాలంటే ఇంకొక ఏడేళ్లు ఆగాల్సిందే.