
వైరల్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి ఈ ఐడియా గురించి వివరిస్తూ కనిపించింది. కుంభమేళాకి జనం పోటెత్తుతారు కాబట్టి చాలామంది వృద్ధులైన తల్లిదండ్రులు రాలేరని, అందుకే తను ఒక కొత్త తరహా వ్యాపారం చేసే వ్యక్తిని కలిశానని చెప్పింది.
ఆ వ్యక్తి సంగమంలో "డిజిటల్ స్నానం" చేస్తానని అంటున్నాడు. అతను చేసేది సింపుల్ ప్రాసెస్. భక్తులు వాట్సాప్ ద్వారా తమ ఫోటోలు పంపాలి. వాటిని ప్రింట్ తీసి నది దగ్గరికి తీసుకెళ్లి, వాళ్ల తరపున ఆ ఫోటోలను నీళ్లలో ముంచుతాడు. ఈ సేవ కోసం ఒక్కొక్కరి దగ్గర రూ.1,100 ఛార్జ్ చేస్తున్నాడు.
@echo_vibes2 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేస్తూ "మహా కుంభ్ ప్రయాగ్ ఎంటర్‌ప్రైజ్ వారి కొత్త స్టార్టప్" అని క్యాప్షన్ పెట్టారు. దీన్ని వేలల్లో జనం చూసేశారు, రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
చాలామంది ఈ ఐడియాని విమర్శిస్తున్నారు. "మతం కూడా వ్యాపారంగా మారిపోయింది" అని ఒక యూజర్ కామెంట్ చేస్తే, "ఇదేం పిచ్చి వెర్రి బ్రో" అని ఇంకొకరు ఎద్దేవా చేశారు. "ఇది జనాన్ని మోసం చేసి డబ్బులు గుంజే కొత్త దారి" అని ఇంకొక నెటిజన్ ఫైర్ అయ్యారు. "మీరంతా జోకర్లు" అంటూ ఇంకొకరు తిట్టిపోశారు.
మరో యూజర్ అయితే మరింత సీరియస్‌గా "కొట్టే పనులు చేయకండి" అని వార్నింగ్ ఇచ్చాడు. చాలామంది భక్తుల నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు చేసుకోవడానికి ఇదొక ట్రిక్ అని మండిపడుతున్నారు. కొంతమందికి ఈ కాన్సెప్ట్ ఫన్నీగా అనిపించినా, మరికొందరు మాత్రం మతాన్ని ఇలా వ్యాపారం చేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు.