
ఫిబ్రవరి మొదటి వారంలో కోళ్ల ఫారంలో పెద్ద ఎత్తున బర్డ్ ఫ్లూ అనే పదం ఎక్కువగా వినిపించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉభయగోదావరి జిల్లాలో ఉండేటువంటి కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని దీంతో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది వైరస్ సోకిన కోళ్లను సైతం కిలోమీటర్ల దూరంలో లోతు గుంతలు తీసి మరి బూడ్చడం జరిగింది. ఈ వైరస్ సోకకుండా ఏపీ ప్రభుత్వం చాలానే జాగ్రత్తలు పడింది. ముఖ్యంగా పశువర్ధన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాల పైన కూడా పలు రకాల సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో 10 కోట్లకు పైగా కోళ్లు ఉంటే ఇందులో 6కోట్లకు పైగా కోళ్లు బర్డ్ ఫ్లూ తోనే మరణించినట్లు తెలియజేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాలలో పౌల్ట్రీ ఫారాలలో కూడా కోళ్లు మరణించాయి. దీంతో. వైద్యులు సైతం బర్డ్ ఫ్లూ అనేది H5N1 అనే ఒక వైరస్ అని ఇది అంటూ వ్యాధి అని పక్షులు జంతువులు మనుషులకు కూడా వ్యాపిస్తుందని వెల్లడించారు. ఇది 1996 లోనే చైనా గుర్తించింది అని తెలిపారు. ఇది ఎక్కువగా యూరప్ దేశాలలో కనిపిస్తుందని తెలిపారు.. ఎక్కువగా లాలాజలం, పక్షులు రెట్టలు, కలుషితమైన ఆహారం నీటి ద్వారా ఇది పక్షులకు సోకుతుండట.
అయితే ఈ బర్డ్ ఫ్లూ సోకిన మాంసం గుడ్లు తినవచ్చా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది?. ముఖ్యంగా 34 డిగ్రీల వద్ద ఉడికించినప్పుడు ఈ వైరస్ అసలు బతకదట. కానీ మనం మాంసాహారాన్ని 70 నుంచి 100° ల మధ్య వేడి చేస్తాము కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలుపుతున్నారు. బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ రంగం పైన పెద్ద దెబ్బ పడింది.