
స్పా, జిమ్, ప్రత్యేక వైన్ కార్నర్ వంటి సదుపాయాలు కూడా ఇందులో ప్రయాణికులకు కల్పిస్తోంది. ఇండియన్ రైల్వే ఐఆర్సిటి సంయుక్తంగా వీటిని నిర్వహిస్తోందట. ఈ సేవలు డిసెంబర్ 14 ,2024 నుంచి ప్రారంభించారు.
ఈ లగ్జరీ రైలులో మొత్తం మీద 80 మంది ప్రయాణించవచ్చట 13 డబుల్ బెడ్ క్యాబిన్లతో పాటు 26 ట్విన్ బెడ్ క్యాబిన్లు కూడా ఇందులో ఉంటాయి. అలాగే దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన క్యాబిన్ కూడా ఉంటుందట. ప్రతి క్యాబిన్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం ఎయిర్ కండిషన్ ఓటీటీ ప్లాట్ఫారం స్మార్ట్ టీవీలు విలాసవంతమైన బాత్రూంలు కూడా అలాగే ఫర్నిచర్స్ కూడా ఉంటాయట.
ఇక భోజనాల విషయానికి వస్తే రుచి మరియు మరొక రెస్టారెంట్ ఇందులో కలగటం భారతీయ వంటలను కూడా అందిస్తారని.. ఎన్నో రుచికరమైన వంటలను కూడా అందిస్తారని తెలుపుతున్నారు.మందుబాబుల కోసం ప్రత్యేకమైన వైన్స్ కూడా ఉంచారట.
ఈ గోల్డెన్ చారియట్ రైలు మొత్తం సీసీటీవీ నిఘా తోనే ఉంటుందట. 24 గంటల భద్రత సిబ్బంది ద్వారానే ప్రయాణికులు భద్రతగా ఉండవచ్చు.
ఇందులో ప్రయాణం ఐదు రాత్రులు ఆరు పగళ్ళు కొనసాగుతూ ఉంటుందట. ఫ్రైడ్ ఆఫ్ కర్ణాటక నుంచి ప్రయాణిస్తే.. బెంగళూరు, మైసూర్, హలే బీడ్, హంపి, గోవా ప్రయాణిస్తుందట.. అలాగే బెంగళూరు, మైసూర్ హంపి మహాబలిపురం కొచ్చి వంటి వాటిలో కూడా ప్రయాణిస్తుందట. వీటితోపాటు మరికొన్ని ప్రాంతాలలోనూ కూడా తీసుకువెళ్తారట.
అయితే ఈ రైలులో ప్రయాణించాలి అంటే..4,00,530 అవుతుంది ఐదు శాతం జీఎస్టీ తో లగ్జరీ వసతులు భోజనాలు లగ్జరీ పానీయాలు ఇతరత్రా ప్రవేశ రుసుములు కూడా ఉంటాయట.