సాధారణంగా చిన్న చిన్న వాటికి భార్యాభర్తల మధ్య అపార్ధాలు వచ్చి క్షణకావేశంలో మరణించిన వారు చాలామంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు వారు ఎందుకు చనిపోయారనే విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో రాయదుర్గం పరిధిలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి దేవిక ఆత్మహత్య చేసుకుందట. అయితే వివాహమైన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఒక టీవీ రిమోట్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఈటీవీ రిమోట్ కోసం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ మొదలై పెద్దదిగా మారి చివరికి ఆమె ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఆదివారం రాత్రి టీవీ రిమోట్ కోసం సతీష్ , దేవిక ఇద్దరు కూడా కొంతమేరకు గొడవ పడ్డారట దీంతో సతీష్ కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోవడం జరిగిందట.. ఇక దేవిక తన భర్తకు 17 సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో చివరికి మనస్తాపం చెంది ఆమె ఫ్యాన్ కి ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కూడా ఒకే సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారట.


వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో ఇరువురు కుటుంబ సభ్యులను మరి ఒప్పించి గత ఏడాది ఆగస్టు 23న గోవాలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారట. అయితే ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రశాంతి హిల్స్ అనే ఒక అపార్ట్మెంట్లో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే అర్ధరాత్రి సమయాలలో దేవిక, సతీష్ గొడవపడేవారట. అయితే ఇలా ఆదివారం కూడా గొడవ పడడంతో ఒక రూమ్ లోకి వెళ్లి దేవిక గడి పెట్టుకుందట.. దీంతో తన భార్య మీద కోపంతో సతీష్ కొద్దిసేపు బయటికి వెళ్లి మరి తిరిగి ఇంటి దగ్గరికి రాగా ఆ తర్వాత ఆమె గడి పెట్టి నిద్రపోయిందనుకున్న సతీష్ ఆ మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి భర్త సతీష్ తలుపులు బద్దలు కొట్టగా దేవిక ఫ్యాన్ కు ఉరివేసుకొని మరణించినట్లు గుర్తించారట. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. దేవిక తల్లిదండ్రులు మాత్రం భర్త వేధింపులు కట్నం కోసం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందంటూ ఫిర్యాదు చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: