అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఏడాది కూడా మార్చి 8వ తేదీన జరుపుకుంటూ ఉంటారు.. ముఖ్యంగా మహిళలు సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతి రంగాలలో కూడా ఎన్నో విజయాలను సాధించిన వారిని కూడా ఆరోజు గుర్తు చేసుకుంటూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటారు. అలాగే లింగ సమానత్వం పైన కూడా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మహిళలకు సంబంధించిన హక్కులను కూడా గుర్తుకు చేస్తూ వారి ప్రాముఖ్యతను కూడా వివరిస్తూ మహిళలు సాధించినటువంటి విజయాలను కూడా గుర్తు చేస్తూ ఉంటారు. అయితే ఇంతకు మార్చి 8వ తేదీన మహిళ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు వాటి గురించి చూద్దాం.


మహిళా దినోత్సవం అనేది కార్మిక ఉద్యమం నుంచి పుట్టిందట.. ఎంతోమంది మహిళలు కూడా తమ హక్కుల కోసం చాలా పోరాటాలు చేశారట. వాటి ఫలితంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఏర్పడిందట.. 1908లో అమెరికాలో న్యూయార్కులో మొదట 15,000 మంది మహిళలు తమ పని గంటలను సైతం తగ్గించాలంటూ డిమాండ్ చేశారట. అలాగే వారికి ఓటు హక్కును కూడా కల్పించాలంటూ పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలనే విధంగా హెచ్చరించారట.


1917లో రష్యా మహిళలు మొదటిసారిగా ప్రపంచ యుద్ధం కారణం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట. సరైన ఆహారం లేక నిద్రలేక ఎన్నో అవస్థలు పడుతూ ఉండడంతో ఆ దేశంలోని మహిళలు కూడా ఆందోళన చేపట్టారట. దీని ఫలితం గానే ఆ దేశపు చక్రవర్తి నికోలస్ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం వల్ల మహిళలకు ఓటు హక్కు కల్పించడం వల్లే మహిళా దినోత్సవం గా జరుపుకుంటున్నారట.ఆరోజు మార్చి 8 కావడం వల్లే ఆ రోజు నుంచి ఇప్పటివరకు మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1975లో మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.దీంతో అన్ని దేశాలలో కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండటమే కాకుండా మహిళలకు అన్ని విధాల సమాన హక్కులు కల్పిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: