
అలాగే శ్రీకాకుళం జిల్లాలో 11, విజయనగరం 16 ,పార్వతీపురం మన్యం 10 , అల్లూరి సీతారామరాజు 10, అనకాపల్లి 2, కాకినాడ1,కొనసీమ 1, తూర్పుగోదావరి 8. ఏలూరు 3 మండలాల్లో వడగాల్పులు ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పుకొచ్చారు .. అలాగే సోమవారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 38. 3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది .. చిత్తూరు జిల్లా గుడిపాలలో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి . కోస్తా తో పాటు రాయలసీమలో కూడా ఈ ఎండలు మండిపోతున్నాయి .. కొన్ని జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కబోతకు అల్లాడిపోతున్నారు .. కొన్ని జిల్లాల్లో వేడీగాలు ప్రభావం ఇంకా రాలేదు .. మార్చ్ లో వేడిగాలుల తీవ్రత బాగా పెరిగిపోతుందని పలు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని అంటున్నారు .. గతంలో ఎప్పుడు లేని విధంగా ఫిబ్రవరిలోని అధిక ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి ..
ఫిబ్రవరి మార్చి నెలలోనే ఎండ ఇలా ఉంటే ఇక ఏప్రిల్ , మే నెలలో పరిస్థితి మరోలా ఉంటుందని ప్రజలు భయపడి పోతున్నారు .. గతంలో కంటే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు అంటున్నారు .. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిదని .. వృద్ధులు , గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు . ఎండాకాలం కాబట్టి తగినంత నీరు అధికంగా తాగుతూ ఉండాలని చల్లని ప్రదేశాల్లో ఉండాలని సూచనలు ఇస్తున్నారు. ఒకవేళ వడదెబ్బ తగిలితే ఎలాంటి ఆలోచన చేయకుండా వైద్యులను సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాలని .. బిహైడ్రేషన్ కు గురకాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తున్నారు . ఇలా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎండల దెబ్బకు జనాలు భయాందోళనకు గురవుతున్నారు.