
ముఖ్యంగా గురుత్వాకర్షణ లేని ప్రాంతంలో ఉన్నప్పుడు నడక కదలికల కోసం ఎక్కువగా శ్రమించాల్సి పని ఉండకపోవడం వల్ల ఎముకలు ,కండరాల పైన ఎలాంటి భారం ఉండదు..కనుక అవి క్షీణతకు మొదలవుతాయట. రోదసిలో 30 రోజులు ఉన్నారంటే ఎముకలు 1-2 శాతం మేర సాంద్రతను కూడా కోల్పోతాయట.. ఇక ఆరు నెలల్లో అది 10 శాతానికి కూడా పెరగవచ్చు . ఈ సమస్య వల్ల వ్యమగాములకు ఎముకలు విరిగి అవకాశం ఎక్కువగా ఉంటుందట. అయితే వీరు తిరిగి కోలుకోవడానికి సుమారుగా నాలుగేళ్ల వరకు పడుతుందట. అయితే వీరు ఎముకల క్షీణత సైతం తగ్గించుకోవడానికి ISS లో చాలా కఠోరమైన వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారట.. సుమారుగా రెండు గంటల పాటు త్రెడ్ మిల్లు లేదా సైకిల్ పైన కసరత్తులు వంటివి చేయాల్సి ఉంటుందట.
శరీరం పైన గురుత్వాకర్షణ బలం అనేది లేకపోతే కండరాలు చాలా బలహీనపడతాయి.. వీటివల్ల కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు.. మనకు సహాయపడే కండరాలు వీపు, మెడ, పిక్కలు వంటివి కండరాల పైన చాలా ప్రభావం చూపిస్తుంది. రోదసిలో రెండు వారాలపాటు ఎవరైనా ఉన్నారంటే 20 శాతం వరకు కండరాలు క్షీణిస్తాయట. నెలలు పెరిగే కొద్దీ శాతం కూడా పెరుగుతుంది.
చెవిలో వెస్టిబ్యులర్ అనే అవయవం ఉంటుంది.ఇది గురుత్వాకర్షణకు సంబంధించిన సమాచారాన్ని మనం మెదడుకు సైతం చేరువేస్తుంది.. అయితే రోదసీలో ఉన్నప్పుడు అక్కడ వెస్టిబ్యులర్ మారిపోతుందట. దీంతో మెదడులో చాలా గందల ఘోరానికి గురయ్యేలా చేస్తుంది.
రోదసిలో ఎక్కువ రోజులు ఉన్నవారికి దృష్టిలోపాలు తలెత్తే అవకాశం ఉంటుందట.
భూమి మీద గురుత్వాకర్షణ శక్తి రక్తం సైతం ఇతర ద్రవాలకు శరీరంలో ఉండి దిగువ భాగాలలోకి లాగుతుంది.. ఆ తర్వాత గుండె పైకి పంపు చేసేలా చేస్తుందట. కానీ రోదసిలో మాత్రం ఈ ప్రక్రియ చాలా గందర గోళానికి గురవుతుందని తెలుపుతున్నారు.. ముఖ్యంగా రోదసిలో గుండె ఆకృతి కూడా మారుతుందట.
రోదసీలో ఉన్నవారు పాదాలలో చర్మాన్ని కోల్పోతారని వీటివల్ల పసిపిల్లలలో ఉన్న పాదాలు ఎంత మృదువుగా ఉంటాయి అలా ఉంటాయట..
అంతేకాకుండా రోదసిలో రేడియో ధార్మికతకు ఎక్కువగా లోన్ అవడం వల్ల తెల్ల రక్త కణాలు తగ్గిపోయి అవకాశం ఉంటుంది. అలాగే క్యాన్సర్, నాడి క్షినత వ్యాధులకు కూడా పెరిగేలా చేస్తుందట.