సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మనం పెట్రోల్, డీజిల్ వంటివి వాహనాలకు కొట్టించుకోవడానికి పెట్రోల్ బంకుల వద్దకు వెళుతూ ఉంటాము. అయితే కొన్ని కారణాల చేత అలా పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకుని వెళ్లిన తర్వాత వాహనాలు మొరాయించితే పెట్రోల్ నాణ్యతలేని కారణంగా బంకు యజమాని కూడా మనం నిలదీయవచ్చు.. అలాంటి సమయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన ఎక్కడ ఫిర్యాదు చేయాలో చాలామందికి తెలియకపోవచ్చు. సాధారణంగా పెట్రోల్ బంకులలో మనకి సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


1). పెట్రోల్ బంకులలో ప్రమాదానికి గురైనప్పుడు కావలసిన  ప్రధమ చికిత్స కిట్టు కచ్చితంగా ఉండాలి.

2). అలాగే చాలామంది దూరప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి నీటి సౌకర్యం కచ్చితంగా ఉండాలి. అందుకు బంకు యజమాని కూడా నాణ్యత కలిగిన ఆర్ఓ యంత్రం నీటి సదుపాయాన్ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది.


3). అలాగే మరుగుదొడ్లు కూడా మహిళలు ,పురుషుల కోసం నిర్మించాల్సి ఉంటుంది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ఇవి పెట్రోల్ బంకులలో ఉండాలి.


4). ముఖ్యంగా అత్యవసర సమయాలలో ఎవరైనా మొబైల్ ఫోన్ ఉపయోగించుకోవడానికి సదుపాయాన్ని కూడా ఉంచాలి.


5). వాహనాల టైర్లలో గాలి నింపుకోవడానికి అలాగే తనిఖీ చేసుకోవడానికి బంకులలో కచ్చితంగా అందుకు సంబంధించిన యంత్రం ఉండాలి. ఇది పూర్తిగా ఉచిత సర్వీస్


6). ఎవరైనా ఆ పెట్రోల్ బంకు యొక్క ఫిర్యాదు చేయడానికి అక్కడ ఒక ఫిర్యాదు పెట్టేను అందుబాటులో ఉంచాలి .వినియోగదారుల ఫిర్యాదులు, సలహాలను రాసి అందులో మనం వేయవచ్చు.

7). పెట్రోల్ డీజిల్ నాణ్యత పైన అనుమానం ఉంటే తనిఖీ చేసుకోవచ్చు. అందుకు కావలసిన పరికరాలు ఫిల్టర్ కాగితాలు బంకు వాళ్లే ఇవ్వాల్సి ఉంటుంది.

పెట్రోల్ బంకులలో ఏ ఒక్కటి లేకపోయినా.. సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన దురుసుగా ప్రవర్తించిన ఈ కింది నెంబర్లకు మన ఫిర్యాదు చేయవచ్చట.


అందులో ఇండియన్ ఆయిల్..1800233355
భారత్ పెట్రోలియం-1800224344
రిలయన్స్ పెట్రోలియం-18008919023
HPCL పెట్రోలియం-18002333555

మరింత సమాచారం తెలుసుకోండి: