
అయితే ఈ జంటకు వివాహం అయినప్పటి నుంచి వీరిద్దరి మధ్య నిత్యం గొడవలే జరుగుతూ ఉన్నాయట. ఈ క్రమంలోనే గడిచిన గురువారం రోజు భార్య భర్తలు ఇద్దరూ కూడా గొడవ పడడంతో భర్తతో గొడవకు దిగిన రవినా తన కోపాన్ని తట్టుకోలేక తన భర్త నాలుకను సైతం కొరికేసిందట. నాలికలో కొంత భాగం వరకు తెగిపోవడంతో ఆ నొప్పి భరించలేక భర్త గిలగిలలాడిపోయారట. ఆ తర్వాత ప్రవీణ భర్త కన్హయల్లాల్ నాలుక ముక్కని చేతిలో పట్టుకొని మరి ఆసుపత్రికి పరిగెత్తిపోయారట.
ఇక తన భర్త అలా వెళ్ళిపోవడంతో భార్య రవీనా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని తన చేతిని కోసుకోవడానికి ప్రయత్నించిందట.ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యుల సైతం తలుపులు పగలగొట్టి మరి ఆమెను బయటకు తీసుకువచ్చి కత్తి లాక్కున్నారు..కన్హయల్లాల్ సైన్ వైద్యులు తెగిపోయిన నాలుకకు డాక్టర్లు కుట్లు వేసి అతికించారట. ఆ వెంటనే ఆ బాధిత కుటుంబ సభ్యుల మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయక చట్ట ప్రకారం రవినాపైన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు తెలియజేశారనీ కన్హయల్లాల్ కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం బాధితుడు మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో అతని వాంగ్మూలం తీసుకోవడానికి సాధ్యపడలేదట. దీంతో భర్త స్టేట్మెంట్ తీసుకొని రవినా ను అరెస్టు చేయబోతున్నారట.