చతిస్గడ్ లో ఎక్కువగా మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య ఎన్నో సార్లు కాల్పులు జరిగాయి. ముఖ్యంగా 2026 నాటికి చతిస్గడ్ లో పూర్తిగా మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ దేశ హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికి ఎన్నోసార్లు చతిస్గడ్ ప్రాంతాలలో భద్రతా దళాలు కూడా చాలాసార్లు కాల్పులు జరిపారు. ఇందులో నక్సలైట్లు కూడా చాలామంది మరణించారు. మరికొన్ని సందర్భాలలో భద్రత దళాలలో కూడా మరణించిన వారు ఉన్నారు.


ఇప్పుడు తాజాగా దంతేవాడ బీజాపూర్ జిల్లాలో సరిహద్దులలో ఉండేటువంటి అడవులలో ఈ ఘర్షణ చోటు చేసుకుందట.  ఈ కాల్కులలో ఐదు మంది మవోయిస్టులు మృతిచెందగా మరి కొంతమందికి గాయాలైనట్లుగా తెలియజేశారు.. అయితే ఎదురు కాల్పులు కొనసాగిస్తూ ఉండగా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా భద్రతా దళాలు తెలియజేస్తున్నాయి. ఆ సంఘటన స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలు భారీ ఆయుధాలను కూడా భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు.


అయితే గడిచిన వారం క్రితమే మావోయిస్టులకు ఒక ఊహించని సంఘటన తగిలింది చతిస్గడ్ దండకారణంలో ఒకే రోజే రెండుసార్లు భారీ ఎన్కౌంటర్లు చేశారు ఇందులో 26 మంది మావోయిస్టు చనిపోగా.. నలుగురు పోలీసులు కూడా మృతి చెందారు. గురువారం ఉదయం నుంచి అడవులలో కుంబ్బింగ్ భద్రత దళాలు మొదలుపెట్టారు.దీంతో ఇరువురి మధ్య కూడా భారీ కాల్పులు జరగడంతో మావోయిస్టులకు చాలా నష్టం వాటిల్లిందట.. ఈ ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేయడమే కాకుండా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారట.అలాగే ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలియజేశారు డిఆర్జి, డిఎస్ఎఫ్ సిబ్బందితోనే ఈ ఆపరేషన్ కొనసాగించినట్లు తెలియజేయడం జరిగింది. గత ఆదివారం రోజున 22 మంది మావోయిస్టులు బీజాపూర్ నారాయణపూర్ జిల్లాలో ప్రభుత్వానికి లొంగిపోయారట. మావోయిస్టుల భావజాలాన్ని విడిచిపెట్టి తాము ప్రజాస్వామ్యంలోకి మనస్ఫూర్తిగా వస్తున్నామని తెలియజేయగా అధికారులు కూడా స్వాగతించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: