
దీంతో కోళ్ల ఫారం నడుపుతున్న వ్యాపారస్తులకు కూడా భారీగా నష్టం వాటిల్లుతోందట. ఇదంతా ఇలా ఉండగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఒక సర్వేలో కూడా పలు కీలకమైన విషయాలు తెలియజేశారు.. ఆంధ్రప్రదేశ్లో 8 ప్రాంతాలలో ఇప్పుడు ఎక్కువగా బర్డ్ ఫ్లూ విస్తరిస్తోందంటు అధికారులు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కోళ్ల ఫారంలో ఉండే కోళ్ళకే కాకుండా ఇంట్లో పెంచుకొనే కోళ్లకు సైతం ఈ వైరస్ సోకుతోందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పు రాష్ట్ర ప్రాంతాలలో ఎక్కువగా H5N1 అధికంగా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు.
ఈ బర్డ్ ఫ్లూ తో ఏకంగా ఆరు లక్షల కోళ్లకు పైగా మరణించినట్లు తెలియజేశారు. ఇటీవలే రీసెంట్ గా కూడా అటు కృష్ణ ,ఎన్టీఆర్, ఉభయగోదావరి జిల్లాలలో కూడా ఈ కేసులు మరింత ఎక్కువగా నమోదవుతున్నాయని తెలియజేశారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల చాలా కోళ్లు మరణించాయని అధికారులు తెలియజేస్తున్నారు.. మళ్లీ ఇలాంటి సమయంలో తిరిగి బర్డ్ ఫ్లూ వైరస్ వేగవంతంగా వ్యాపిస్తోందని తెలిసి అటు ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ఈ బర్డ్స్ లు విషయం పైన అటు రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. దీంతో మళ్లీ చికెన్ తినడం ప్రజలు తగ్గిస్తున్నారు.