సాధారణంగా శ్రీరామనవమి పండుగను చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు హిందువులు. ఇందులో కొంతమంది మాత్రం రామకోటి రాయాలని తపనతో రాస్తూ ఉంటారు. అయితే రామకోటి రాయడం అనేది కూడా ఒక సంస్కారం అని చెప్పవచ్చు. ఈ రామకోటి రాయాలనుకునే వారు ముందుగా ఆ పుస్తకాన్ని దేవుడు సన్నిధిలో ఉంచి మరి పూజ చేసిన తర్వాత పసుపు కుంకుమతో చల్లి.. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని గ్రంథంలో భావించి కళ్ళకు అద్దుకొని మరి ప్రారంభించాలి.



రామకోటి రాయాలనుకునే వారు ఎవరైనా సరే శ్రీరామనవమి రోజున మొదలు పెడితే చాలా మంచిదట.


శ్రీరామ అంటే సీతమ్మ..మొదలుపెట్టేటప్పుడు శ్రీరామ అని రాయాలి..రామ రామ అని కూడా రాయకూడదట..


రామకోటి రాసేటప్పుడు సంఖ్య కోసం రాయకూడదు. మీ యొక్క మనసు ఎంతసేపు రాసే వాటి మీద దృష్టి పెడితే అంతవరకు రాస్తే చాలట. శ్రీరామ అని రాసేటప్పుడు మనసు పెట్టి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా మధ్యలో ఆపావలసి వస్తే వారు బేసి సంఖ్య దగ్గర ఆపడం మంచిది.


రామకోటి రాసేటప్పుడు భక్తిశ్రద్ధలతో రాస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు వస్తాయట.


రామకోటి రాసే పుస్తకాన్ని ఎక్కడైనా సరే ఒక చోట భద్రంగా ఉంచాలి. మన తర్వాత తరానికి కూడా ఆ పుస్తకం విలువ తెలిసేలా ఉండాలి. రామకోటి రాసిన పుస్తకాన్ని సైతం భద్రాచలంలో లేకపోతే గుంటూరు రామనామ క్షేత్రంలో కూడా పుస్తకాలు భద్రపరచవచ్చు.


రామకోటి రాయడానికి ఎలాంటి ప్రత్యేకమైన సమయం అనేది ఉండదు. మన శుభ్రతతో ప్రశాంతంగా పవిత్రంగా రాయడం ముఖ్యము.

రామకోటి రాసే పుస్తకంలో సైతం ఎలాంటి వివరాలు నమోదు చేయవద్దు. అంతేకాకుండా రామకోటి రాసే పుస్తకానికి సైతం ఎలాంటి స్టిక్కర్స్ కానీ ఇతరత్రా ఫోటోలను అతికించకపోవడం మంచిది.



శ్రీరామనవమి రోజున మొదలుపెట్టి రాస్తే మరింత విజయం అందుతుందని పూర్వీకుల నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి: