
తూర్పు పడమర 380 అడుగుల పొడవు.. 250 అడుగుల వెడల్పు ఎత్తు 161 అడుగులు ఉన్నది. ఇక ఆలయం 20 అడుగుల ఎత్తులో ఉన్నదట. మొత్తం 44 తలుపులు 392 స్తంభాలు కలిగి ఉన్నది. ప్రధాన గర్భగుడిలో శ్రీ రామ్ లాల్ విగ్రహం ఉన్నది. ముఖ్యంగా ఈ గుడి నిర్మాణ సమయంలో ఎక్కడా కూడా ఇనుమును ఉపయోగించలేదట. అంతేకాకుండా అయోధ్య రామ మందిర నిర్మాణంలో సైతం ఒక అద్భుతమైన సృష్టిని సృష్టించారు అదేమిటంటే సూర్య కిరణాలు బాల రాముడు విగ్రహాన్ని తాకేలా ప్రత్యేకించి ఏర్పాటు.
శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం చేస్తారు వీటితోపాటు సూర్యకిరణాలతో తిలకం దిద్దెల ప్రత్యేకించి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది బాల రాముడి నుదుటి పైన సుమారుగా 4 నిమిషాల పాటు ఉంటుందట. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు అయోధ్యకు వెళుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన అక్కడ శ్రీరామ జన్మభూమి ట్రస్టు ఇంట్లో ఉండే వారికి కూడా వీటిని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేసింది. అలాగే ఆలయం మూడు అంతస్తు నుంచి గర్భగుడిలోకి బాలరాముడు నుదుటి పైన ఈ సూర్య కిరణాలు పడేలా ప్రత్యేకించి ఏర్పాటు చేశారట. శ్రీరాముడు శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారని అందుకే తిలకం దిద్దడం జరుగుతోందట. ఈరోజు ఒక్కటే సుమారుగా అయోధ్యకు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చేలా ఆలయ ట్రస్ట్ అంచనా వేస్తోంది. ఇక అక్కడ అన్ని ఏర్పాట్లను చేశారు.