
వీడియోలలో కస్టమర్లు మా దేవుళ్ళు అంటూ మాట్లాడే అలేఖ్య వాస్తవ జీవితంలో మాత్రం ఇంతలా బూతులు తిడుతుందా అంటు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా సినిమా ప్రమోషన్స్ కి మీరు మాట్లాడినటువంటి ఆడియోను ఉపయోగించడమే కాకుండా సోషల్ మీడియాలో రీల్స్ అన్ని కూడా వీరివే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ వివాదం పెద్దదవుతూ ఉండడంతో మీడియా ముందుకు వచ్చి అక్కాచెల్లెళ్లు సైతం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు.అలేఖ్య బూతులతో రెచ్చిపోవడానికి కారణం పలు రకాల అంశాలు ఉన్నాయని తెలిపారు.
అయితే ఇవేవీ కూడా ఆటు నేటిజెన్లను పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయాయి. అలేఖ్యకి సంబంధించిన పాత వీడియోలను కొత్త వీడియోలను సైతం ట్రెండ్ చేస్తూ వైరల్ గా చేస్తూ ఉండడంతో చివరికి అలేఖ్య చిట్టి క్షమించాలి అంటూ ఒక వీడియోని సైతం సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.. తాను తప్పు చేశాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఎవరినైతే ఇప్పటివరకు తిట్టానో అందరికి కూడా స్వారీ అడుగుతున్నానంటూ తెలియజేసింది. దీంతో అలేఖ్య చిట్టి పీకేల్స్ బిజినెస్ కి కూడా బ్రేక్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. వాట్సప్, ఇంస్టాగ్రామ్ ఇతరత్రా వెబ్సైట్లకు అన్నిటికీ కూడా సోషల్ మీడియాలో బ్లాక్ చేసి ఉంచారు. ఈ కాంట్రవర్సీ తగ్గేవరకు బిజినెస్ మూసివేయాలని అలేఖ్య పికిల్స్ అనుకుంటున్నారట. ఇప్పటికే చాలా తీవ్ర స్థాయిలో నష్టపోయారని సమాచారం .మరి తిరిగి మళ్లీ కస్టమర్లను రాబట్టడం అనేది కూడా పెద్ద సవాల్ గా మారింది.