అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం రోజురోజుకీ ముదురుతున్న  వేళ.. ఈ విషయం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. కస్టమర్ ను  బయటకు చెప్పలేని రీతిలో బూతులు తిట్టి, తీవ్ర నెగెటివిటీ మూటగట్టుకున్న అలేఖ్య.. హాస్పిటల్లో చేరింది.  ఆమెకు శ్వాస సరిగ్గా అందకపోవడంతో హాస్పిటల్ లో చేర్చినట్లు.. అలేఖ్య అక్క సుమ ఒక ఎమోషనల్ వీడియోని కూడా విడుదల చేశారు. ఇక అసలు విషయంలోకెళితే.. ముగ్గురు అక్కచెల్లెళ్ళు 'అలేఖ్య చిట్టి పికెల్స్' పేరిట బిజినెస్ చేస్తూ.. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళుతున్నరు. ఒక కష్టమర్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారు. అయితే ధరలు చెప్పేసరికి ఇంత రేటు ఎందుకు అని కస్టమర్ అడగగా.. అలేఖ్య బూతులు తిట్టి,  చెప్పుకోలేని మాటలను కూడా ఆమె అనడంతో బాగా హర్ట్ అయిన సదరు కస్టమర్ ఆమె ఆడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీంతో ఈ ఆడియో కాస్త ఇంటర్నెట్లో వైరల్ అవ్వగా భారీ మీమ్స్ , ట్రోల్స్ వచ్చాయి.


దీంతో సోషల్ మీడియాలో నెగిటివిటీ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇ సమయంలో  అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్ సుమా,  రమ్య తో పాటూ అలేఖ్య  కూడా స్పందించి క్షమాపణలు చెప్పారు. అయినా సరే ట్రోల్స్,  మీమ్స్ ఆగకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది అలేఖ్య. అలేఖ్య బ్రీతింగ్ కూడా తీసుకోలేకపోతోంది. కృత్రిమ ఆక్సిజన్ ఆమెకు అందిస్తున్నారని.. అలేఖ్య అక్క సుమ.


మూడు నెలల క్రితమే మా నాన్న చనిపోయారు. మరో చావును మా ఇంట్లో మేము చూడదలుచుకోలేదు. ఇక మాకు ఈ పచ్చళ్ల బిజినెస్ వద్దు..యూట్యూబ్ వద్దు..ఏం వద్దు.. నా చెల్లి అలేఖ్య ఆరోగ్యంగా తిరిగి వస్తే చాలని కోరుకుంటున్నాను"అంటూ సుమ కన్నీటి పర్యంతమయ్యింది. ఇక సుమ షేర్ చేసిన ఈ వీడియో కూడా అందరిని కదిలించిందని చెప్పవచ్చు. కనీసం ఇకనైనా ఈ విషయాన్ని ఇంతటితో ఆపాలని లేకపోతే అమ్మాయి ప్రాణానికి ఏదైనా ముప్పు కలిగితే అది సోషల్ మీడియాదే బాధ్యత అవుతుందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంతటితో పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: