
ఇంక అంతే సంగతులు, ఆ డబ్బా లోపలికి వెళ్ళిపోయింది కానీ బయటికి రాలేదు. ఎవరి సాయం అడగలేక, డాక్టర్ దగ్గరకు వెళ్లలేక సైలెంట్‌గా భరించాడు. టైం గడిచే కొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. ఆ తర్వాత జ్వరం, నీరసం, ఆకలి లేకపోవడం, విరేచనాలు కూడా స్టార్ట్ అయ్యాయి.
ఒంట్లో అసలు ఓపిక లేనప్పుడు ఇక తప్పక హాస్పిటల్‌కి వెళ్ళాడు. డాక్టర్లు పరీక్షించి చూడగా.. అతనికి సెప్సిస్ అనే ప్రాణాంతక ఇన్ఫెక్షన్ సోకిందని తేలింది. బాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. పరిస్థితి చాలా సీరియస్‌గా ఉన్నా.. అతను మాత్రం మెంటల్‌గా స్టేబుల్‌గానే ఉన్నాడని డాక్టర్లు చెప్పారు.
వెంటనే డాక్టర్లు ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు. ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఆపరేషన్ చేయకుండానే ఆ డబ్బాని బయటికి తీశారు. అంతేకాదు.. అంతకుముందు అతడు ఒక రాయిని కూడా లోపలికి పంపించాడని, దాన్ని కూడా డాక్టర్లు రిమూవ్ చేశారు.
కేవలం ఏడు రోజుల్లోనే ఆ రైతు ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాడు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, కానీ మానసిక నిపుణులు అతనికి కౌన్సిలింగ్, థెరపీ ఇస్తున్నారని సమాచారం.
ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే.. చాలామంది శృంగార కోరికలతో రకరకాల వస్తువుల్ని బాడీలో పెట్టుకుంటున్నారని, దానివల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని డాక్టర్లు అంటున్నారు. నవంబర్ 2024లో ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ నెలలోనే షాంగైలోని యిడా హాస్పిటల్‌లో డాక్టర్ చెన్ జియి అనే సీనియర్ సర్జన్ దగ్గరకు 24 ఏళ్ల యువకుడు వచ్చాడు. అతడు 20 సెంటీమీటర్ల సెక్స్ టాయ్‌ని వెనకాల పెట్టుకుని ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ టాయ్ ఇంకా వైబ్రేట్ అవుతూనే ఉంది.
ఈ రెండు ఘటనలు చూస్తే.. బాడీలో ఏదంటే అది పెట్టుకుంటే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. దయచేసి ఇలాంటి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.