చాలామంది వ్యాపారాలు మొదలుపెట్టి ఎంత కష్టపడినా లాభాలు రావడం లేదని చెబుతూ ఉంటారు. మరికొంతమందికి ఏ వ్యాపారాలు చేస్తే తక్కువ సమయంలో లాభాలు వస్తాయో తెలీక ఇబ్బందులు పడుతూ ఉంటారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించాలనుకునేవారు సీజనల్ వ్యాపారాలు చేయడం మంచిది. నూతన సంవత్సరం సమయంలో కేకులు తయారు చేసుకొని అమ్మితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు.
అదేవిధంగా స్కూల్ ఓపెనింగ్ సమయంలో నోట్ బుక్స్, బ్యాగుల బిజినెస్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు. కానీ ఈ బిజినెస్ లలో సక్సెస్ కావాలంటే మంచి సెంటర్ ను ఎంచుకోవాలి. అలాగే వినాయక చవితి పండుగ సమయంలో వినాయకుని ప్రతిమలను కొనుక్కొని వ్యాపారం చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అదే విధంగా శీతాకాలంలో స్వెట్టర్ లను విక్రయించటం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు.
దీపావళి పండుగ సమయంలో క్రాకర్స్ అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. వేసవికాలంలో ఫ్రిజ్, కూలర్లను అమ్మడం ద్వారా లాభాలను పొందవచ్చు. ఇప్పటికే ఏవైనా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నవారు ఇలాంటి బిజినెస్ లు చేసి లాభాలు పొందవచ్చు. ఈ వ్యాపారాల వలన తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఒకే వ్యాపారానికి పరిమితమైతే కొన్ని సందర్భాల్లో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా సీజన్ ను బట్టి వ్యాపారాలు చేస్తే తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో లాభాలను పొంది వ్యాపారాలలో విజయం సాధించవచ్చు.