జీవితంలో ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే పాజిటివ్ ఆలోచనలతోనే ముందుకెళ్లాలి. అలా కాకుండా నెగిటివ్ ఆలోచనలు మనస్సులోకి వచ్చాయంటే మాత్రం విజయాన్ని సొంతం చేసుకోవడం కష్టం. కష్టపడి ప్రణాళికబద్ధంగా లక్ష్యసాధన దిశగా కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని గుర్తుంచుకోవాలి. అలా ప్రయత్నించి విజయాన్ని సొంతం చేసుకుంటే పాజిటివ్ ఆలోచనలకే అలవాటు పడటం ఖాయం.
నెగటివ్ ఆలోచనలతో కొత్త సమస్యలు కూడా క్రియేట్ అవుతాయనే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నెగిటివ్ ఆలోచనలతో ఉన్న సమయంలో మనపై ఎవరైనా కోప్పడితే మనం కూడా వెంటనే వారిని కోపగించుకుంటాం. ప్రతి విషయం గురించి అలా జరగదేమో అని ఆలోచించకుండా ఇలా చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అనే ఆలోచనలతో ముందుకెళ్లాలి. మనం ఆలోచిస్తే ప్రతి పనిని సాధించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి.
పాజిటివ్ గా ఆలోచించే విధానాన్ని అందిపుచ్చుకుంటే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్లే సమయంలో కొన్నిసార్లు అనుకున్న విజయాలను సాధించలేకపోవచ్చు. కానీ ఓడిపోయినా సరైన అవకాశాలను అందిపుచ్చుకుని ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సొంతమవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. అయినా నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని వీడకపోతే ఇష్టమైన పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకొని ముందడుగు వేస్తే సక్సెస్ తప్పకుండా సొంతం అవుతుంది.