ఈ మధ్య కాలంలో సాధించే సత్తా ఉన్నా చాలామంది చెడు స్నేహాల వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. చెడు స్నేహాల వల్ల జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. ఒక దశలో ఆ తప్పులను గుర్తించినా అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో చాలామంది కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. చెడు స్నేహాల కారణంగా తప్పుడు మార్గంలో నడిచి ఆ తప్పులను సరిదిద్దుకోలేకపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
జీవితంలో చేసే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఎంతో కృషి అవసరం. చెడు స్నేహాల వల్ల ప్రతికూల పరిస్థితులు దాపురించాయంటే మాత్రం నిరాశ, నిస్పృహలతో జీవితం చేతులారా నాశనం అవుతుంది. మానవ జీవితంలో యుక్త వయస్సు అనేది ఎంతో కీలకమైన దశ. ఈ దశ భవిష్యత్ కు బంగారు బాట వేసుకునేందుకు ఎంతో ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి ఒక్కసారే ఈ సమయం లభిస్తుంది.
ఈ కాలాన్ని వృథా చేసుకుంటే జీవితాంతం బాధలు పడాల్సి వస్తుంది. జీవితంలో ఎల్లప్పుడూ మంచి స్నేహాలు కలిగి ఉన్నవారు త్వరగా విజయం సాధిస్తారనే మాట వాస్తవం. మీ భవిష్యత్తును నాశనం చేసేలా మీతో ప్రవర్తించేవారు అసలు స్నేహితులే అనిపించుకోరు. వారి విషయంలో అప్రమతంగా ఉండాలి. నిరంతర కృషి ఉంటే లక్ష్యాలను సాధించుకోవడం కష్టం కాదు. మంచి అలవాట్లు ఉన్నవారితో స్నేహం చేస్తూ లక్ష్యం కోసం కష్టపడితే తక్కువ సమయంలోనే విజయం సొంతం చేసుకోవచ్చు.