అమ్మ ప్రేమ ఆవు పాలలా, మధురమైన తేనెల ఉంటుంది. ఆమె ప్రేమకి సాటి ఎవరు లేరు  కదా... అమ్మ తన బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. అనుక్షణం తోడై నీడై గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంటి. బాధగా ఉన్నప్పుడు చెయ్యవేసి భుజం పై ఆమె నడిపిస్తుంది.

 

IHG's birthday <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PARTY' target='_blank' title='party-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>party</a> held at ...

 

నిత్యం కొత్త విషయాలని చెబుతూ చక్కటి దారిలో పయనించడానికి మంచి ప్రోత్సాహం అందిస్తుంది అమ్మ. అమ్మా అని అంటే కష్టాలు కూడా రావు కదా చెంతకి. కొన్ని సినిమాలు కూడా అమ్మ ప్రేమని కళ్ళకి కట్టేలా చూపించాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన అమ్మా నాన్న తమిళ్ అమ్మాయి చిత్రం కూడా తల్లి కొడుకుల మధ్య బంధం చూపించింది.

 

అందులో వరమల్లే అందించింది ఈ బంధం, వెలలేని సంతోషాలు నీ సొంతం....నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే, కనిపించకపోతే బెంగై వెతికావే... అన్న ఈ పదాలు ఏ కవి కలం నుండి జాలువారాయో కానీ హృదయాన్ని తాకాయి. అలానే మహేష్ బాబు నటించిన నాని చిత్రంలో కూడా తల్లి ప్రేమ కళ్ళకి కనపడుతుంది. ఆ సినిమాలో పెదవే పలికిన మాటల్లోనే..... ఈ పాట ఎవర్గ్రీన్.

 

 

అమ్మని కదిలే దేవతని, కంటికి వెలుగుని, నా ఆలీ అమ్మగా అవుతుండగా... ఇలా అనేక అమృత పదాలు ఇందులో కురిపించాడు కవి. ఇలా అమ్మని ఆమ్మ ప్రేమని కూడా చూపించారు అనేక సినిమాల ద్వారా. ఆమ్మని మంచి నేస్తంగా, మంచి తోడుగా, మంచి ప్రోత్సాహికారిగా భావించాలి. ఆమె ప్రేమని మరెక్కడా పొందలేరు. కాబట్టి పెంచి పెద్ద చేసిన అమ్మకి అమ్మై చూసుకోవాల్సిన బాధ్యత కూతుర్లది, కొడుకులదే కదా....

మరింత సమాచారం తెలుసుకోండి: